EPAPER

YS Sharmila : షర్మిల కోసం ఏపీలో పిచ్చాసుపత్రి!.. జగన్ కు ఓ మంత్రి లేఖ!

YS Sharmila : షర్మిల కోసం ఏపీలో పిచ్చాసుపత్రి!.. జగన్ కు ఓ మంత్రి లేఖ!

YS Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్ర షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే షర్మిల 3 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయగా.. తనకు రావలసినంత పొలిటికల్ మైలేజ్ రాలేదన్నది ఆమె బాధ. అయితే, ఎవరినీ పట్టించుకోకుండా నడుస్తూనే ఉన్నారు. అన్నిపార్టీలపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి జాతీయ దర్యాప్తు సంస్థలకు పిర్యాదు కూడా చేసొచ్చారు. వచ్చాక మళ్లీ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ.. తాజాగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించారు షర్మిల. ఆమె ప్రజాప్రస్థాన యాత్ర 199వ రోజుకు చేరింది.


షర్మిల వెంట పట్టుమని 10మంది నేతలే ఉంటున్నా.. ఆగేదేలే అంటూ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఆమె కమిట్ మెంట్ ను మాత్రం మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. అయితే, షర్మిల ఎంత పరుషంగా విమర్శలు చేస్తున్నా.. మిగతా పార్టీ నేతలు ఆ మాటలను పట్టించుకోకుండా లైట్ తీసుకుంటుండటంతో.. రాజకీయ వేడి రాజుకోవడం లేదు. షర్మిల ఏ ప్రాంతానికి వెళితే.. ఆ ప్రాంత లీడర్లు మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో, మీడియాలో పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు. జగన్ సోదరికి తగినంత ప్రచారం, ప్రాచుర్యం దక్కడం లేదని చెబుతున్నారు.

తాజాగా, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు వేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే కొందరు నడుస్తూ వచ్చి రాజకీయం చేస్తారు.. పంట చూస్తూ ఎంజాయ్ చేయండి.. అంతేగానీ రాజకీయం చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు.. అంటూ పరోక్షంగా షర్మిల టార్గెట్ గా కామెంట్లు చేశారు.


పనిలో పనిగా పవన్ కల్యాణ్, కేఏ పాల్ లపైనా పంచ్ లు వేశారు. త్వరలోనే జగన్ కు లేఖ రాస్తానని.. ఏపీ వాళ్లు ఇక్కడ యాత్రలు ఎందుకు చేస్తున్నారో అడుగుతానన్నారు. నాయకుల చేష్టలు పిచ్చివాళ్లలా ఉన్నాయని.. ఏపీలోనూ ఎర్రగడ్డలాంటి పిచ్చాసుపత్రి కట్టించి వారిని అక్కడ చేర్పించాలని సీఎం జగన్ ను కోరుతానన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×