EPAPER

China Space Station Falling : భూమి పై పడనున్న చైనా స్పేస్ స్టేషన్ మాడ్యూల్..

China Space Station Falling : భూమి పై పడనున్న చైనా స్పేస్ స్టేషన్ మాడ్యూల్..

China Space Station Falling : చైనా నుంచి ఇప్పుడు ప్రపంచానికి మరో ముప్పు వాటిల్లనుంది. అంతరిక్షంలో ఉన్న చైనా స్పేస్ స్టేషన్ శకలాలు భూమి మీద పడనున్నాయి. 88 శాతం ప్రజలు నివసించే ప్రదేశంలోనే ఈ శకలాలు పడనున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంతరిక్షంలో చైనా తన సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించే పనిలో ఉంది. అతి త్వరలోనే ఈ లక్ష్యాన్ని చైనా చేరుకోనుంది. దీనిలో భాగంగా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను చైనా గత వారం అంతరిక్షంలో ప్రయోగించింది. అంతరిక్ష్యంలోకి వెళ్లిన తరువాత అది మళ్లీ తిరిగి భూకక్ష్యలోకి ఎంటర్ అవుతుంది. భూ కక్ష్యలోకి రాగానే ఆ స్పేస్ స్టేషన్ భాగాలన్నీ ముక్కలుగా విడిపోయి భూమి మీద పడతాయి. అయితే అది భూమి మీద సరిగ్గా ఎక్కడ పడనుందనే విషయాలు మాత్రమే శాస్త్రవేత్తలు అక్యురేట్‌గా వెళ్లడించలేదు.


లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సాయంతో ఈ న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపించారు. ఈ స్పేస్‌స్టేషన్ లాంచ్ ప్రయోగం సక్సస్ అయినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. లక్ష్యిన్ని చేరుకున్న 48 గంటల తరువాత ఈ రాకెట్ భూభాగంలోకి తిరిగి రానుందన్నారు. 88 శాతం ప్రజలు నివసించే ప్రాంతంలో పడనుందని చెబుతున్నా.. జనాభా సాంద్రత తక్కువగా ఉన్న చోట, సముద్రం, ఎడారి, అడువులు లాంటి ప్రదేశంలోనే ఈ స్పేస్ స్టేషన్ శకలాలు పడనున్నాయి.

ఈ న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్ 10 అంతస్థుల భవనం అంత ఎత్తులో ఉంటుంది. 2020 నుంచి చైనా ఇలాంటి స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్‌ను ఇదివరకే 3 సార్లు ప్రయోగించి. ఆ మూడు సార్లు కూడా ఇలాగే ఆ స్పేస్ స్టేషన్ శకలాలు భూవాతావరణ కక్ష్యలోకి ప్రవేశించి సముద్రం, ఖాళీ ప్రదేశంలో పడిపోయాయి.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×