EPAPER

Trolled Movies In 2023 : 2023 అత్యధికంగా ట్రోలింగ్ అయిన చిత్రాలు..

Trolled Movies In 2023 : 2023 అత్యధికంగా ట్రోలింగ్ అయిన చిత్రాలు..
Trolled Movies In 2023

Trolled Movies In 2023 : సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సక్సెస్ అందుకోలేక ఇబ్బంది పడతాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు.. ఆ అంచనాలని చేరుకోలేని నేపథ్యంలో పలు రకాల విమర్శలు ఎదుర్కోవడం సహజమే. అలా కొన్ని సినిమాలు విపరీతంగా ట్రోలింగ్ కు గురి అవుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ మాత్రం చిన్న పాయింట్ దొరికినా సరే వదలకుండా ట్రోల్ చేసేస్తున్నారు. అలా ఈ సంవత్సరం విపరీతంగా ట్రోల్స్ కి ఫుల్ మీల్స్ లాగా దొరికిన చిత్రాల లిస్టు చూద్దాం..


ఆదిపురుష్

శ్రీరాముని చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఆది పురుష్ చిత్రం.. ఎన్నో వాయిదాల తర్వాత భారీ అంచనాల మధ్య విడుదల అయింది. మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేసుకున్నప్పటికీ.. ఈ చిత్రం విపరీతమైన ట్రోలింగ్ కు గురి అయింది. రామాయణం లోని కొన్ని అంశాలను చాలా క్రియేటివ్ గా చూపించాలి అని భావించిన ఓం రౌత్ ఆలోచన కాస్త వికటించడంతో ఈ చిత్రం పలు రకాల విమర్శలు ఎదుర్కొంది. ఈ మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్ ని విడివిడిగా నెటిజన్స్ ట్రోల్ చేశారు. నాసిరకమైన గ్రాఫిక్స్, ప్రభాస్ లుక్స్, కొన్ని డైలాగ్స్, రావణాసురుడిని చూపించిన విధానం.. ఇలా ప్రతి ఒక్క విషయం గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.


శాకుంతలం

మొదటిసారి సమంత ఒక పౌరాణిక పాత్రలో నటించిన మూవీ శాకుంతలం. కాళిదాసు వివరించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన శకుంతల.. దుష్యంతుల అపురూపమైన ప్రేమ చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత జీవించేసింది. అయినా ఈ చిత్రం దారుణమైన ట్రోలింగ్ కి గురి అయింది. దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో మూవీ క్వాలిటీ దగ్గర నుంచి వీఎఫ్ఎక్స్..గ్రాఫిక్స్ నుంచి సమంత లుక్స్ వరకు ప్రతి ఒక్కటి ట్రోలింగ్ కి గురి అయింది. ఈ సంవత్సరం వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా చేరిపోయింది.

భోళా శంకర్

వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత.. ధైర్యం చేసి మెగాస్టార్ మెహర్ రమేష్ తో మూవీ చేశారు. ఈ డిజాస్టర్ డైరెక్టర్ చేతి మహిమ భోళాశంకర్ ఎవరు ఊహించనంత డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీలో చిరంజీవి లుక్స్.. అనవసరపు అతి కామెడీ.. మీమర్స్ కు మంచి పని పెట్టింది. అలా  మెహర్ రమేష్ పుణ్యమా అని.. ఈ చిత్రం విపరీతమైన ట్రోలింగ్ కి గురి అయింది.

చంద్రముఖి 2

2005లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రం ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో రజనీకాంత్ తో పాటు జ్యోతిక యాక్షన్ కి ప్రజలు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో రాఘవ లారెన్స్ చేసిన అతి.. కంగనా లుక్స్.. కుక్కలతో కంగనా ఫైట్.. గ్రాఫిక్స్.. వీఎఫ్ఎక్స్.. ఇలా ప్రతి ఒక్కదానిపై ట్రోలింగ్ జరిగింది. ఈ సంవత్సరం అత్యధికంగా ట్రోలింగ్ కి గురి అయిన చిత్రాలలో ఈ మూవీ టాప్ లిస్టులో నిలిచింది.

స్కంద

ట్రోలర్లకు, మిమర్స్ కు మంచి ఎనర్జీ ఇచ్చే కంటెంట్తో సినిమాలు తీసే వ్యక్తి బోయపాటి శ్రీను . రీసెంట్ గా ఇతను రామ్ తో తీసిన స్కంద మూవీలో చాలా సీన్స్ ట్రోలర్స్ కి మంచి కంటెంట్ అందించాయి. మరి ముఖ్యంగా ఫైటింగ్ మధ్యలో టార్న్ జీన్స్  నుంచి రామ్ కత్తి తీసిన స్టైల్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఈ సంవత్సరం మీమర్స్ వాడిన బెస్ట్ డైలాగ్ లో క్రాక్ చేసి హ్యాక్ చేయడం అనే డైలాగ్ అందించింది స్కంద మూవీ.

ఆదికేశవ

ఆదికేశవ మూవీ టీజర్ విడుదలైనప్పటి నుంచి ట్రోలింగ్ మొదలైంది. ఈ మూవీకి అవుట్డేటెడ్ అనే వర్డ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయారు మిమర్స్. దూకుడు మూవీలో ఒక్క యాక్సిడెంట్ సీన్ ని అలాగే  వాడేసుకున్నారు ఈ చిత్ర బృందం. ఈ విషయంపై ఈ చిత్రం దారుణమైన ట్రోల్లింగ్ కి గురి అయింది.

ఏజెంట్

ఈ సంవత్సరం టాలీవుడ్ లో ట్రోలింగ్ గా బాప్ అని ఏ చిత్రం గురించైనా చెప్పొచ్చు అంటే అది ఏజెంట్ మూవీ. కఠోరమైన డైట్ చేసి, కండలు పెంచి.. అక్కినేని అందగాడు నటించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. అసలు ఈ మూవీ థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందదో ..ఎప్పుడు వెళ్లిందో ..తెలియదు కానీ.. ఇప్పటికి కూడా ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక మీమ్ ..ట్రోల్ మనం చూస్తూనే ఉంటాం.

Related News

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Big Stories

×