EPAPER

Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు

Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు

Tirumala: తిరుమలలో రద్దీ ఉంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగే అవకాముందని అధికారులు చెబుతున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 వందల రూపాయల టికెట్స్‌ను నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 29 వరకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్‌-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌-హైదరాబాద్‌ రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.


శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు క్యూ కట్టారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్లియర్ చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. శ్రీశైలం క్షేత్రానికి రావడానికి, పోవడానికి సింగిల్ రోడ్డు కావడంతో వీకెండ్స్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు నిత్యకృత్యంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలువులు వస్తే మల్లన్న భక్తులకు మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకోవాల్సి వస్తోంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు తరలివెళ్తున్నారు. ఉచిత దర్శనానికి 8 గంటల సమయం, టికెట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత అభిషేకాలు నిలుపుదల చేసి స్పర్శ దర్శనం, అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×