EPAPER

TS Debts : తెలంగాణలో హాట్ టాపిక్ గా శ్వేతపత్రాల వ్యవహారం.. అప్పుల ఊబిలో డిస్కంలు..

TS Debts : తెలంగాణలో హాట్ టాపిక్ గా శ్వేతపత్రాల వ్యవహారం.. అప్పుల ఊబిలో డిస్కంలు..
breaking news in telangana

TS Debts News(Breaking news in telangana) :

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన శ్వేతపత్రాల విడుదల వ్యవహారం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తుంది. అసెంబ్లీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఆర్ధిక.. విద్యుత్.. నీటిపారుదల రంగాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. అయితే పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టడానికి మాత్రమే శ్వేతపత్రాలను ప్రవేశపెట్టామని.. ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులను అడ్డుగా చూపిస్తూ తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదన్నారు సీఎం రేవంత్.


వాటిలో ముందుగా ఆర్ధిక రంగంపై శ్వేతపత్రాన్ని గమనిస్తే.. అందులో 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన ఖర్చులో.. తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు.. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో వివరించారు. 2014 నుంచి 2023–24 బడ్జెట్‌ ప్రతిపాదనలతో కలిపి.. మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులను ప్రకటించారు.

తెలంగాణ ఏర్పడే నాటికి 75 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే.. గత పదేళ్లలో అది పది రెట్లకు పైగా పెరిగి 7 లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందని భావిస్తున్నారు. FRBM కింద తెచ్చిందే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని.. వివిధ కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి లక్షా 30 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల ద్వారా మరో లక్షా 10 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటి పోతుందని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్‌ చేయాలంటే మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా అవసరమని అంచనా. మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు తెస్తే తప్పు పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేసే పరిస్థితి లేదని అందులో వెల్లడించారు.


గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని.. ఏకంగా 20 శాతం తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించింది. ఇక తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు, వడ్డీ కూడా ఏటికేడు భారీగా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు… ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీయే 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

ఇక విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని గమనిస్తే.. విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యంపై కూడా భట్టి లెక్కలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కోలో విద్యుత్ సామర్థ్యం 4,365.26 మెగావాట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే.. ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పతి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.

డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడంలేదని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు. 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు 81,516 కోట్ల రూపాయల అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డిస్కంలకు పలు శాఖల నుంచి 28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు 62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించక పోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగ దీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజువారి విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా.. వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ను అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

రాష్ట్రంలో యాదాద్రి, పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాది పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల 40 శాతం అదనపు వ్యయం పెరిగిందన్నారు.యాదాద్రి, భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తెచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని హెచ్చరించారు. యాదాద్రి, భద్రాద్రి, చత్తీస్ ఘడ్ ల విద్యుత్ ఒప్పందంతో కలిసి వచ్చిన విద్యుత్ 1000 మెగావాట్లు అని తెలిపారు.

ఇక తాజాగా విద్యుత్ శాఖలో మూడు అంశాలపై న్యాయ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీష్ గడ్ ఒప్పదం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. 24 గంటల కరెంట్ పై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని తెలిపారు.

.

.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×