EPAPER

AP Elections 2024: ఏపీకి ఈసీ టీమ్.. రెండ్రోజులు రాష్ట్రంలో పర్యటన

AP Elections 2024: ఏపీకి ఈసీ టీమ్.. రెండ్రోజులు రాష్ట్రంలో పర్యటన
latest news in Andhra Pradesh

AP Elections 2024 update(Latest news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టింది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరిగాయి. దీంతో వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఏపీలో పర్యటనకు రెడీ అయ్యారు.


ఇప్పటికే సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్‌ వ్యాస్‌ సహా.. డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఈ బృందం పర్యటించనుంది. 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అధికారులు సమీక్షించనున్నారు.

ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈరోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుండగా.. 23న 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతారు. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలీస్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు. అలానే 23వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులకు.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు.


ఈ సమావేశంలోనే ఓటర్ జాబితాపైనా అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లపై అధికార.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వీటి గురించి కూడా అధికారుల బృందం చర్చించనున్నట్లు సమాచారం.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×