EPAPER

Dunki Movie Review : ఎమోషనల్ టచ్ .. డంకీ మూవీ ఎలా ఉందంటే..?

Dunki Movie Review : ఎమోషనల్ టచ్ ..  డంకీ మూవీ ఎలా ఉందంటే..?
Dunki movie review

Dunki Movie Review : ఈ సంవత్సరం ఇప్పటికే రెండు భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న బాలీవుడ్ బాద్షా ఇయర్ ఎండింగ్ ని ముచ్చటగా మూడో సక్సెస్ తో క్లోజ్ చేయాలి అని తెగ తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కలిసి డంకీ మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చాడు. విడుదలకు ముందు నుంచి భారీ హైప్ సృష్టిస్తున్న ఈ మూవీ.. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు సాటిస్ఫై చేసిందో చూద్దాం..


మూవీ: డంకీ 

నటీనటులు: షారుఖ్ ఖాన్,తాప్సీ పన్ను,విక్కీ కౌశల్,    బొమన్ ఇరానీ


డైరెక్టర్: రాజ్‌కుమార్ హిరానీ

నిర్మాతలు: గౌరి ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ,జ్యోతి దేశ్‌పాండే

మ్యూజిక్: ప్రీతమ్

నిర్మాణ సంస్థలు: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్

రిలీజ్ డేట్: 21 డిసెంబరు 2023

కథ:

హర్డీ సింగ్ (షారుఖ్).. తనని కాపాడిన వ్యక్తిని వెతుక్కుంటూ పంజాబ్ లోని ఒక ఊరికి వెళ్తాడు . అయితే ఊరు వెళ్ళిన తర్వాత అతనికి సాయం చేసిన వ్యక్తి ఇక లేడని.. అతని కుటుంబం అంతా చాలా ఇబ్బందుల్లో ఉంది అని తెలుసుకుంటాడు. వాళ్లకి సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇక ఆ ఊర్లోనే ఉండాలి అనుకుంటాడు. హర్డీ కు సాయం చేసిన వ్యక్తి చెల్లి మను ( తాప్సీ). తను కష్టాల నుంచి బయటపడాలి అంటే లండన్ వెళ్లడం ఒకటే మార్గం అని భావిస్తుంది మను. ఆమె స్నేహితులు కూడా ఇదే ఆలోచనతో ఉండడంతో ఆమెను కలుస్తారు. వీళ్లను లండన్ తీసుకువెళ్లడానికి హార్డీ ఏం చేశాడు…? ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు? అనే విషయం స్క్రీన్ పై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ మూవీ మొత్తానికి ఐదుగురు మిత్రుల మధ్య జరిగే ఒక కథ. విదేశాలకి వెళ్లాలి అంటే దండిగా డబ్బు ఉండాలి. ఇంగ్లీష్ చదువు బాగా వచ్చి ఉండాలి. మరి అవి రెండూ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. అదిగో అక్కడే మన స్టోరీకి పునాది మొదలవుతుంది. ఎలాగైనా లండన్ వెళ్లాలి అని సక్రమ మార్గంలో ప్రయత్నించే విసుగు చెందిన ఒక ఫ్రెండ్ బ్యాచ్ కి ఇక అక్రమ మార్గమే కరెక్ట్ అన్న భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లు ఎన్ని అగచాట్లు పడ్డారు.. అనే పాయింట్ తో కథను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు హిరానీ.

ఇక ఈ మూవీలో షారుక్ నటన మార్వలస్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. టైంలీ కామెడీతో.. మొదటిసారి ఎమోషనల్ రోల్ ను కూడా ఎంతో అద్భుతంగా క్యారీ చేశాడు. తాప్సీ, విక్కీ కౌశల్ నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంది.బోమన్ ఇరానీ పర్ఫామెన్స్ గురించి అసలు డౌట్ పడాల్సిన పనిలేదు. మిగిలిన నటులు కూడా తమ పాత్ర పరిధిలో అద్భుతంగా నటించారు.

కామెడీతోపాటుగా ఆలోచింపచేసే రియాలిటీ కి దగ్గరగా ఉండే చిత్రాలను తీయడంలో హిరానీ ఎక్స్పోర్ట్. జీవితంలో ఎదగాలి అనే తపనతో అక్రమ దారిలో అయినా సరే వేరే దేశానికి వెళ్లాలి అని యత్నించే వ్యక్తులు. తీరా వలస వెళ్లిన తర్వాత అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో అన్న విషయాన్ని హృదయానికి హత్తుకునే విధంగా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో ఒక్క విక్కీ కౌశల్ పాత్రకు తప్ప మిగిలిన పాత్రలకు లండన్ వెళ్లడానికి మరీ స్ట్రాంగ్ రీసన్ చూపించలేదు.

మన దగ్గర ఉన్న ఎన్ని అవకాశాల్ని వదులుకొని కేవలం విదేశానికి వెళ్లడం ఒక్కటే మార్గం అని చూపించడంతో ఈ మూవీ కాస్త రియాలిటీ కి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ మాత్రం ఇరగదీసింది. ఇక ఇందులో వాళ్లు ఇంగ్లీష్ నేర్చుకునే సన్నివేశాలు అయితే మరింత కడుపుబ్బా నవ్వించే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ సందేశాత్మకంగానే కాకుండా మంచి వినోదాత్మకంగా కూడా ఉండడంతో సందేహంలేదు.

చివరి మాట:

ఓవరాల్ గా హిరానీ మార్క్ మూవీ ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి.. మంచి కామెడీ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×