EPAPER
Kirrak Couples Episode 1

Singer Sunitha Son : హీరోగా తెరంగేట్రం చేస్తున్న ప్రముఖ సింగర్ కొడుకు..

Singer Sunitha Son : హీరోగా తెరంగేట్రం చేస్తున్న ప్రముఖ సింగర్ కొడుకు..
Singer Sunitha Son

Singer Sunitha Son : సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా స్టార్ హీరోల వారసులు, వారసురాలు కనిపిస్తారు. సరియైన టైం చూసుకొని తమ పిల్లలను టాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పించి బాగా సెటిల్ చేసేస్తున్నారు సెలబ్రిటీలు. అలా తాజాగా సింగర్ సునీత కూడా తన కొడుకు ఆకాష్ ను టాలీవుడ్ కి పరిచయం చేసింది. ఆకాష్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కార్ నౌకరి అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు గంగనమోని శేఖర్ నిర్వహిస్తున్నారు.


భావనా వళపండల్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో పాటు ఫుల్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్లో చాలా న్యాచురల్ గా ఉన్న విజువల్స్.. ఇరగదీసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇప్పుడు పాత రోజుల్లో జరిగిన ఏదో ఒక యదార్థ సంఘటన అంటూ తీసే సినిమాలకు బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 1996 తెలంగాణలోని కొల్లాపూర్ లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ టైటిల్ స్టోరీ గురించి కాస్త హింట్ ఇచ్చే విధంగా ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి అప్పటి సెట్టింగ్స్ ,కాస్ట్యూమ్స్ చాలా అద్భుతంగా వాడారు అన్న విషయం ట్రైలర్ లో అర్థమైపోతుంది.


హీరో, హీరోయిన్ల పెళ్లి తంతుతో మొదలయ్యే ట్రైలర్ లో హీరో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతుంది. ఆ టైంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా క్రేజ్ అయితే ఇతను పనిచేసేది హెల్త్ డిపార్ట్మెంట్ కావడంతో అసురక్షితమైన రొమాన్స్ జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తుంది అన్న విషయంపై గ్రామస్తులకు అవగాహన కల్పించే పనిలో ఉంటాడు. ప్రతి ఇంటికి , గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి కండోమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు.

అయితే అతను చేసే ఈ పని ఊరిలో వాళ్లకి సరిగ్గా అర్థం కాకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అందరూ అతని ఉద్యోగాన్ని హేళనగా చూస్తారు. హీరో భార్య కూడా అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని బాధపడుతుంది. ఒకానొక టైంలో అతన్ని ఎందుకో ఊర్లోకి కూడా రావద్దని వార్నింగ్ ఇస్తారు. ఇక ట్రైలర్ ఎండ్ కి సర్కార్ నౌకరీ అంటే సర్కారు దగ్గర జీతం తీసుకోవడం మాత్రమే కాదు సార్.. ప్రజలకు సేవ చేయడం అనే మంచి పవర్ఫుల్ హీరో డైలాగ్.. మంచి ఫినిషింగ్ ఇచ్చింది. మొత్తానికి మూవీ కాన్సెప్ట్ వెరైటీగా ఉంది అన్న విషయం ట్రైలర్తో అర్థం అవుతుంది. ఇక మూవీ విడుదల అయ్యాక ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ చిత్రం న్యూ ఇయర్ బహుమతిగా జనవరి 1న విడుదల కాబోతోంది.

Related News

Devara Movie: మరోసారి ‘దేవర’కు ‘ఆంధ్రావాలా’తో పోలిక.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?

Devara Pre Release Event: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

Director Shankar: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Guinness World Record : గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్… ఎంత మంది సౌత్ స్టార్స్ ఉన్నారో తెలుసా?

Chiranjeevi: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చిరుకు చోటు… ఎందుకో తెలుసా?

Amitabh Bachchan: అప్పుడు నేలపైనే పడుకునేవారు, ఆయన స్టార్లలోనే సుప్రీమ్.. రజినీపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Big Stories

×