EPAPER

Yuvagalam: యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam:  యువగళం పాదయాత్ర సక్సెస్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..

Yuvagalam: ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. రాష్ట్రం మొత్తంగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. 3132 కిలో మీటర్లు మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను తిరుగుతూ ప్రజలను, కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.


జగన్ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలను వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. దీంతొ యువగళం పాదయాత్రకు భారీగా స్పందన వచ్చింది . సోమవారం గాజువాకలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద మినీ పైలాన్ ఏర్పాటు చేసి పాదయాత్రను ముగించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువగళం పాదయాత్ర కూడా ముగించడం మరో విశేషం.

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైంది. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్‌ సమరశంఖం పూరించారు. కానీ గాజువాకలో పాదయాత్రకు ముగింపు పలికారు.


మరోవైపు డిసెంబర్‌ 20న విజయనగరం జిల్లాలోని భోగాపురంలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి యువకులు, ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికారు. విశాఖపట్టణం జిల్లాలోని భోగాపురంలో జరిగే యువగళం బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు, మద్దతు దారులు ఈ రోజే ప్రత్యేక రైల్లో బయలు దేరారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×