EPAPER

 Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ అదృష్టం ఎలా ఉంది?

 Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ అదృష్టం ఎలా ఉంది?
Sunrisers Hyderabad team news

Sunrisers Hyderabad team news(Latest sports news telugu):


తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో మాత్రమే విజేతగా నిలిచింది. తర్వాత నుంచి ఇంతే సంగతి. ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు. ఎప్పుడు చూడు, కింద నుంచి మూడు స్థానాల్లో ఉండటమే. ఎంతమంది ఆటగాళ్లను మార్చినా సరే, దీని బతుకు చిత్రం మారలేదు.

జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అసలు ఆటలోకి వచ్చేసరికి తేలిపోయేవారు. ప్రస్తుతం టీంలో సరైన పేరున్న బ్యాటర్ లేకపోవడం బలహీనత గా ఉంది. ఆల్‌రౌండర్ కొరత కూడా ఉంది. దీంతో ఎప్పుడో పాత ఫార్ములా ఐదుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్లు, ఒకవికెట్ కీపర్ ఇలా వెళుతున్నారు. కీపర్ కూడా బ్యాట్స్ మెన్ అయి ఉంటే, జట్టుకి అదనపు బలం..అలాంటి వాడు దొరకడం లేదు.


ఐదుగురు బ్యాటర్లు అయిపోయిన తర్వాత, ఆరో బ్యాటర్ గా కీపర్ వస్తాడు. తర్వాత ఆల్ రౌండర్ వస్తాడు. అలా చూసుకుంటే ఏడు స్థానాల వరకు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. టీమ్ ఇండియాలోకి కీపర్ కం బ్యాటర్ గా ధోనీ వచ్చిన తర్వాత జట్టు స్వరూపమే మారిపోయింది. ఇంక కెప్టెన్ కావడంతో బ్యాటర్లు, బౌలర్లపై కెప్టెన్సీ భారం తగ్గిపోయింది. వాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడేవారు. లేదంటే అటు బ్యాటింగ్ చేయాలి, ఇటు కెప్టెన్సీ చేయాలంటే ఒత్తిడితో నలిగిపోయేవారు.

ధోనీ ఫార్ములా ఇప్పటికీ నడుస్తోంది. క్రికెట్ ఆడే దేశాలన్నీ ఇదే ఫాలో అవుతున్నాయి. కీపర్ అంటే మంచి బ్యాటర్ కూడా అయి ఉండాలనే నిబంధన వచ్చేసింది. ప్రస్తుతం టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ ఇలా వచ్చేవాళ్లందరూ ఇదే తీరున వస్తున్నారు.  డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. బీసీసీఐ ఎంపిక కూడా అదే రీతిలో సాగుతోంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఈ సమతూకం లోపించింది. వస్తే అందరూ హార్డ్ హిట్టర్స్ వస్తున్నారు. లేదా అంతా లెఫ్ట్ హ్యాండర్స్, లేదా రైట్ హ్యాండర్స్ ఉంటున్నారు. దీంతో బ్యాలెన్ కావడం లేదు. ఈ నేపథ్యంలో  హర్షల్ పటేల్ లేదా శార్దుల్ ఠాకూర్ వైపు చూస్తుంది. అంతేకాదు ఇండియన్ టాపార్డర్ బ్యాటర్, మంచి విదేశీ పేసర్ వస్తే బ్యాలెన్స్ సెట్ అవుతుంది. అలాగే ఒక ఆల్ రౌండర్ కావాలి, కీపర్ కం బ్యాటర్ కావాలి.

పర్స్‌లో బాగానే డబ్బులు ఉన్న నేపథ్యంలో స్టార్ ప్లేయర్ల కోసం ఎంతవరకైనా వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈసారి కూడా సెట్ కాకపోతే ఇక ఏకంగా అందరినీ సాగనంపి మెగా వేలంలో కొత్తవారిని కొనుక్కోవడమే మంచిదనే ప్రాథమిక ఆలోచనకు అప్పుడే ఫ్రాంచైజీలు వచ్చినట్టు సమాచారం,

Related News

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

Big Stories

×