EPAPER

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Gandhi Bhavan PAC : కాంగ్రెస్ పీఏసీ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

Gandhi Bhavan PAC : హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. పీఏసీ ఛైర్మన్‌ మాణిక్‌ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలి పీఏసీ భేటీ ఇది. పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై చర్చించారు.


పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఠాక్రే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు చాలా కష్టపడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ విధానాలు, హామీలను ప్రజలు విశ్వసించారని అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో మంచి విజయం కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

ఆర్థిక పరిస్థితిని పీఏసీ సభ్యులు వివరించారని షబ్బీర్ అలీ సమావేశ వివరాలను వెల్లడించారు. గ్రామసభలు నిర్వహించిన 6 గ్యారంటీలు వివరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. నీటి పారుదల రంగంలోనూ, మిషన్ భగీరథ పేరుతో జరిగిన అవకతవకలు గుర్తించామన్నారు. అన్ని అంశాలపై జనవరి 28 నుంచి కార్యాచరణ చేపడతామన్నారు.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×