EPAPER

Red sandalwood smuggling : సినిమా స్టైల్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్.. టాస్క్ ఫోర్స్ పట్టేసిందిలా..!

Red sandalwood smuggling : సినిమా స్టైల్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్..  టాస్క్ ఫోర్స్ పట్టేసిందిలా..!

Red sandalwood smuggling : చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల పై దాడులు చేశారు. సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలించారు.


లారీలో వేసుకొని వెళ్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. నాలుగు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. స్మగ్లర్లు ఎర్రచందనం గోడౌన్ కాపలాదారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డారు . తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందిందన్నారు.


టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారం రోజులుగా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించామన్నారు. సత్యవేడుకు చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×