EPAPER

Laddu Box : రూ.లక్ష పెట్టుబడి.. 2 కోట్ల టర్నోవర్

Laddu Box : రూ.లక్ష పెట్టుబడి.. 2 కోట్ల టర్నోవర్
Laddu Box

Laddu Box : లడ్డూ.. అందరికీ సుపరిచితమైన మిఠాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా లభించే స్వీట్. చక్కెర లేకుండా బెల్లం, ఖర్జూరంతో చేసే లడ్డూలు మరింత రుచిని సంతరించుకుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్నారు కాబట్టే.. సాందీప్ దంపతులను విజయం వరించింది.


కేవలం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి.. ‘లడ్డూ బాక్స్’ను రెండు కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థగా తీర్చిదిద్దారు. సాందీప్ జోగిపర్తి, అతని భార్య కవిత గోపు ఇద్దరూ నాలుగేళ్ల క్రితం అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. సాందీప్ కాలిఫోర్నియాలో డేటా ఇంజనీర్ కాగా.. కవిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఐదేళ్లు ఆ ఉద్యోగాలు చేసిన అనంతరం ఆంత్రప్రెన్యూర్లుగా ఎదగాలనే ఆలోచన వచ్చింది. దీంతో 2019లో సొంత ఊరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.

ఆంత్రప్రెన్యూర్లకు గల అవకాశాలను అన్వేషిస్తూ ఆరేడు నెలలు దేశమంతటా పర్యటించారు. వివిధ మార్కెట్ల స్థితగతులనూ అంచనా వేశారు. ఫుడ్, ఫిట్‌నెస్ రంగాలైతే ఉజ్వలమైన పురోగతి ఉంటుందని సాందీప్ భావించాడు. వాస్తవానికి ప్యాకేజ్డ్ స్వీట్స్ మార్కెట్‌లో అపార అవకాశాలున్నాయి.


రసగుల్లా, గులాబ్‌జామ్, బర్ఫీ, సోన్ పాపిడి, లడ్డూ వంటి మిఠాయిల అమ్మకాలు ఏ సీజన్‌లోనైనా పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ 6 వేల కోట్లకుపైనే. ప్యాకేజ్డ్ స్వీట్స్ మార్కెట్ 2032 నాటికి రూ.26 వేల కోట్లకు చేరుతుందని వ్యాపార నిపుణుల అంచనా. 2024-32 మధ్య 16.67 శాతం పురోగతి ఉంటుంది చెబుతున్నారు.

దీంతో లడ్డూల వ్యాపారంలోకి దిగాలని సాందీప్ జంట నిర్ణయించింది. అయితే పోషక విలువలతో కూడిన మిఠాయిలను తయారీ చేయాలని వారు సంకల్పించారు. తియ్యదనం కోసం చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరాన్ని వాడారు. బెల్లంలో ఐరన్, ఫైబర్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ స్వీట్ల‌ను తొలినాళ్లలో వివిధ ఐటీ కంపెనీల్లో‌ని స్టాల్స్, ఇతర ఫెయిర్ల‌లో విక్రయించారు.

అనంతరం కస్టమర్ల నుంచి పెద్ద మొత్తాల్లో ఆర్డర్లు రావడం ఆరంభమైందని సాందీప్ వెల్లడించారు. తమ తొలి పెట్టుబడి లక్ష రూపాయలు మాత్రమేనని వివరించారు. వ్యాపారంలోకి దిగిన కొన్నాళ్లకే కొవిడ్ మహమ్మారి విజ‌ృంభించింది. లాక్‌డౌన్ వల్ల రెండు నెలలు వ్యాపారం నడవలేదు. అప్పుడే లడ్డూ బాక్స్ స్టార్టప్‌ను అధికారికంగా ప్రారంభించిందా జంట.

నాలుగు రకాల లడ్డూలతో ఆరంభమైన లడ్డూ బాక్స్.. ఇప్పుడు మల్టీగ్రెయిన్ లడ్డూ, మిల్లెట్ లడ్డూలు, చిక్కి లడ్డూలు వంటి 15 రకాల వెరైటీలను అందిస్తోంది. తమ మిఠాయిల్లో చక్కెరే కాదు.. ఎలాంటి కృత్రిమ రంగులు, ఫ్లేవర్లను చేర్చడం లేదని సాందీప్ వివరించారు. మరో ముగ్గురు ఫుల్‌టైమ్ ఉద్యోగుల సాయంతో సాందీప్‌-కవిత జంట వ్యాపారాన్ని చూసుకుంటోంది. ప్రస్తుతం దానిని రూ.2 కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేర్చగలిగారు.

రానున్న రెండేళ్లలో బెంగళూరు, హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ‌ల్లో వంద స్టోర్ల వరకు ఓపెన్ చేయాలని సాందీప్ దంపతులు భావిస్తున్నారు. మిఠాయిల తయారీకి అవసరమైన బెల్లాన్ని తెలంగాణ, మహారాష్ట్ర రైతుల నుంచే నేరుగా సేకరిస్తుండటం విశేషం.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×