EPAPER

Indian Railways : వెయిటింగ్ లిస్ట్‌కు స్వస్తి..? రైల్వేశాఖ కీలక నిర్ణయం..

Indian Railways : వెయిటింగ్ లిస్ట్‌కు స్వస్తి..? రైల్వేశాఖ కీలక నిర్ణయం..

Indian Railways : రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండకూడదు. అలాగని ఆ ఆప్షన్ తీసేయడం కాదు. రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. జీరో వెయిటింగ్ లిస్ట్ టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళ్తోంది. అందుకు తగ్గ ప్రణాళికల్ని పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి.


దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు జనం. కానీ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు వెక్కిరిస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో టికెట్లు బుక్ అవడమే గగనంగా మారుతున్న పరిస్థితి. మూడు నెలల ముందు ట్రై చేసినా టికెట్ దొరకని పరిస్ధితి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్య పెంచాలని రైల్వే మంత్రి వైష్ణవ్ నిర్ణయించారు.

15 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయలు విలువైన కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్న పాత, డొక్కు రైళ్ల స్థానంలో సుమారు 7, 8 వేల కొత్త రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రానున్న నాలుగైదు ఏళ్లలో వీటి కోసం టెండర్లు ఆహ్వానించనున్నట్లు వైష్ణవ్ చెప్తున్నారు.


ఏటా పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో కొత్త రైళ్ల ప్రతిపాదనలు కనిపిస్తుంటాయి. కానీ ప్రధానమంత్రి మోడీ హయాంలో కొత్త రైళ్లు బాగా తగ్గించారు. టైమ్ మెయింటెనెన్స్‌పై ఫోకస్ పెంచారు. పెండింగ్ ట్రాక్‌లు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.. అనే నానుడి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అదే సమయంలో బుల్లెట్, హైస్పీడ్ ట్రెయిన్స్ పట్టాలెక్కించాలని, భారతీయ రైల్వేలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేశారు. అవేవీ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కనిపించడం లేదు. దీంతో ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త ట్రెయిన్స్ కొనుగోలు చేయడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ప్రస్తుతం రైల్వే రోజుకు 10,754 ట్రిప్స్ నిర్వహిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలంటే అదనంగా మరో 3 వేల ట్రిప్స్ పెరగాల్సి ఉంటుంది. అంటే దాదాపు మూడో వంతు విస్తరణ జరగాలి. రైళ్ల సంఖ్యను పెంచుతామంటే ఇప్పుడున్న లైన్లు, టెక్నాలజీ, మాన్ పవర్ సరిపోకపోవచ్చు. ఆ దిశగానూ విస్తరణ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కొవిడ్ ముందు పరిస్థితితో పోలిస్తే… ఇప్పటికే రైల్వే శాఖ 568 ట్రిప్పుల్ని అదనంగా నిర్వహిస్తోందని వైష్ణవ్ గుర్తుచేశారు. ఏటా 700 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారని.. 2030 నాటికి ఈ సంఖ్య వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు 2.4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అందులో 70 శాతం నిధుల్ని వినియోగించినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 5,6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్స్ నిర్మాణం పూర్తి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది సగటున రోజుకు 16 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం పూర్తి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. భవిష్యత్‌లోనూ టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తామని, జీరో వెయిటింగ్ లిస్ట్ వంటి సేవలు అందిస్తామని చెప్తున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×