EPAPER

Big Boss Winners : ఒక్కప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్నర్స్.. మరిప్పుడు..?

Big Boss Winners : ఒక్కప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్నర్స్.. మరిప్పుడు..?
Big Boss Winners

Big Boss Winners : అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది.. మా ఇంటికొచ్చి తైతక్కలాడింది.. ఈ పొడుపు కథ మనలో చాలామందికి తెలుసు. ఇదే రకంగా ఎక్కడో హాలీవుడ్ లో పుట్టి ..అక్కడ ప్రాచుర్యం పొంది ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో గా చలామణి అవుతుంది బిగ్ బాస్. ఆరు సీజన్లో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ ఆల్మోస్ట్ పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇంతకుముందు సీజన్లో విజేతలు ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఓ లుక్ వేద్దాం పదండి.


బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైందంటే చాలు హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ తెగ హడావిడి చేస్తారు. షో ఆసక్తిగా మారుతున్న కొద్ది ప్రతి ఒక్కరికి కొందరు ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారుతారు. ఇక వాళ్లు ఫైనల్ వరకు రావాలని ఓటింగ్ కూడా విపరీతంగా చేస్తారు మన ఆడియన్స్. ఆ తర్వాత విన్నర్ అయిన వాళ్ళ గురించి కొన్ని రోజులు మంచి పబ్లిసిటీ ఇవ్వడం .. ఇక ఆ తర్వాత వాళ్ల గురించి పట్టించుకునే వాళ్లే ఉండరు. ఇలా ఇప్పటికి జరిగిన ఆరు సీజన్లో చాలామంది కంటెస్టెంట్స్ మరుగున పడిపోయారు. వరుసగా బిగ్ బాస్ ప్రతి సీజన్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఫస్ట్ సీజన్ ..సెకండ్ సీజన్ విన్నర్ ఎవరు అని సడన్గా అడిగితే గబుక్కున గుర్తు రాదు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్ విన్నర్స్ ఎవరు.. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న విషయం తెలుసుకుందాం పదండి.

మరి కొన్ని గంటల్లో.. కొద్దిరోజులుగా ఆసక్తిగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు ఎండ్ కార్డ్ పడబోతోంది.. ఇంట్లో మిగిలిన సభ్యులలో విన్నర్ ఎవరో తేలిపోతుంది.. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంతకుముందు విన్నర్స్ గురించి తెగ సర్చింగ్ జరుగుతుంది. మరోపక్క ఉన్న వాళ్లలో ఎవరు గెలుస్తారు అనే విషయంపై  చర్చలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గెలిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై బిగ్ టీవీ తరఫునుంచి ఓ స్పెషల్ స్టోరీ.


సీజన్ 6:

సీజన్ 6 లో విజేతగా నిలిచింది సింగర్ రేవంత్. ఈ షోలో పాల్గొనడానికి అంటే ముందు కూడా సింగర్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది.. పైగా ఇండియన్ ఐడల్ 9 విజేతగా కూడా. ఇక బాహుబలి మనోహరి పాట తర్వాత ఇతనికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ లో ఎంటర్ కాకముందే గట్టి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతనికి ఈ షో గెలవడం వల్ల ప్రత్యేకంగా వచ్చిన గుర్తింపు అయితే ఏమీ లేదు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు ఇతనికి  10 లక్షల క్యాష్ తో పాటు.. సువర్ణభూమి వారు గిఫ్ట్ రూపంలో ఇచ్చిన 650 గజాల ఫ్లాట్ గిఫ్ట్ రూపంలో అందాయి. అంటే మొత్తానికి అతనికి బిగ్ బాస్ నుంచి కోటి రూపాయల వరకు దక్కింది అని తెలుస్తుంది.

సీజన్ 5:

బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన వ్యక్తి సన్ని. సీజన్ మొదటినుంచి తనకంటూ హౌస్ లో ప్రత్యేకమైన ఇమేజ్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు సన్నీ. ఓటింగ్ పరంగా తీసుకున్న ఫినాలే లో 50 శాతం ఓట్లు సన్నికే పడ్డాయి.. అంటే మనోడు ఆట ఏ రేంజ్ లో ఆడాడో చూడండి. ఇక ఈ సీజన్ విజేతగా నిలిచినందుకు టైటిల్ ట్రోఫీతో పాటుగా 50 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్.. సువర్ణభూమి తరఫున షాద్ నగర్‌లో 25 లక్షల రూపాయల విలువ చేసే ప్లాట్..టీవీయస్ బైక్ బహుమతి రూపంగా గెలుచుకున్నాడు. ప్రస్తుతం తన అదృష్టాన్ని ప్రయత్నిస్తూ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్నాడు.

సీజన్ 4:

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్. ప్రస్తుతం ఇతని గురించి గుర్తు చేస్తే తప్ప ఎవరికీ గుర్తు రాదు. విజేత అయిన తర్వాత మంచిగా అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్నాడు కానీ ఊహించిన స్థాయిలో మాత్రం బిగ్ బాస్ నుంచి అతనికి ఫేమ్ దక్కలేదు. మరి ఫ్యూచర్ లో ఏమన్నా కలిసి వస్తుంది ఏమో చూడాలి. ఇక విజేతగా నిలిచినందుకు 25 లక్షల రూపాయల ప్రైస్ మనీ తో పాటు కొత్త బైక్ ని కూడా అతను సొంతం చేసుకున్నాడు.

సీజన్ 3:

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం అన్ని సీజన్లో విజేతలతో పోలిస్తే కాస్త కూస్తో పబ్లిక్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్న వ్యక్తి ఇతనే.ఆర్ఆర్ఆర్  సినిమాతో మంచి ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై పాట పాడి వరల్డ్ వైడ్ రికార్డు లోకి ఎక్కాడు. ఒకరకంగా ఇప్పటివరకు విజేతలగా నిలిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో బాగా లాభపడింది ఈ పాత బస్తీ కుర్రాడే. పాటలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపించి మెప్పిస్తున్నాడు.

సీజన్ 2:

కౌశల్ మందా బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచాడు. గెలిచిన మొదటి రెండు నెలలు ఇతను బాగా పాపులర్ ఫిగర్ గా చలామణి అయ్యాడు.. కొత్త షాప్ ఓపెనింగ్స్.. రిబ్బన్ కటింగ్స్.. టీవీ ఇంటర్వ్యూస్.. ఇలా కొన్ని రోజులు హడావిడి తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పెద్దగా కౌశల్ గురించి ప్రస్తావన లేదు దీంతో దాదాపుగా అందరూ అతన్ని మర్చిపోయారు అని చెప్పాలి.

సీజన్ 1:

మొట్టమొదట బిగ్ బాస్ సీజన్.. సీజన్ వన్ విజేతగా నిలిచింది యాక్టర్ శివ బాలాజీ. ఈ షో చేయకముందే యాక్టర్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది. గెలిచిన తర్వాత కూడా ఒక రెండు మూడు చానల్స్ లో కాస్త ఇంటర్వ్యూలు ..ఒక వారం హడావిడి అంతే.. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం అతను పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు. నిజానికి బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందు అడపాదడపా సినిమాల్లో అయినా కనిపించే అతను షోలో పాల్గొన్న తర్వాత ఆ నాలుగు ఛాన్సులు కూడా పోగొట్టుకున్నాడా అనిపిస్తుంది. సీజన్ పూర్తయ్యాక విన్నర్ అయ్యాడు కానీ.. ఆ తర్వత మెల్లిగా ఫేడౌట్ అయిపోయాడు.  

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×