EPAPER

India Vs South Africa Tour : సౌత్ ఆఫ్రికా టూర్ కి.. వాళ్లిద్దరూ వెళ్లడం లేదు

India Vs South Africa Tour : సౌత్ ఆఫ్రికా టూర్ కి.. వాళ్లిద్దరూ వెళ్లడం లేదు
India Vs South Africa Tour

India Vs South Africa Tour : అందరూ అనుకున్నట్టే అయ్యింది. సౌత్ ఆఫ్రికా టూర్ కి వాళ్లిద్దరూ వెళ్లడం లేదు. అదేనండీ వరల్డ్ కప్ హీరోల్లో ఓకరైన మహ్మద్ షమీ, మరొకరు దీపక్ చాహర్..ఇద్దరూ ఆగిపోయారు. దీపక్ వన్డే మ్యాచ్ లకు , షమీ టెస్ట్ మ్యాచ్ లకు ఎంపికయ్యారు. ఇప్పుడు షమీ ప్లేస్ లో టీ 20, వన్డే ల నుంచి ఫేస్ బౌలర్లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసేలా ఉన్నారు. వన్డే మ్యాచ్ ల వరకు చూస్తే దీపక్ చాహర్ ప్లేస్ లో ఆకాశ్ దీప్ ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.


దీపక్ తండ్రికి అకస్మాత్తుగా సీరియస్ కావడంతో తను ఇండియాలోనే ఉండిపోయాడు. ఇదే విషయాన్ని బోర్డు, టీమ్ మేనేజ్మెంట్, కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు అందరికీ తెలిపి, తన సమస్యను వివరించాడు. ఇకపోతే మూడు టీ 20లు ఆడని శ్రేయాస్ అయ్యర్ తొలి వన్డే మాత్రమే ఆడనున్నాడు.

తర్వాత రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతాడని బీసీసీఐ తెలిపింది. గాయం కారణంగా వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు దూరమైన మహ్మద్ షమీ ఫిట్ నెస్ నిరూపించుకోవడంలో విఫలమైనట్టు బీసీసీఐ తెలిపింది.


ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ బయటకు చెప్పని బీసీసీఐ మహ్మద్ షమీ ఫిట్ నెస్ విషయంలో చెప్పడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇదెక్కడి అత్యుత్సాహం అని అంటున్నారు. ఈరోజు ఫిట్ నెస్ ఫెయిల్ అయ్యాడు. రేపు పాస్ అయ్యాడంటే, ఇలాగే చెబుతారా? లేక జట్టులోకి ఎంపిక చేసి ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.

మళ్లీ ఇక్కడ నుంచి ఆఫ్గనిస్తాన్ టూర్ కి టీమ్ ఇండియా వెళుతుంది. తర్వాత వచ్చిన వెంటనే ఐపీఎల్ మీద పడతారు. అదైన వెంటనే పొట్టి వరల్డ్ కప్ పోటీలు, ఒక్క క్షణం కూడా తీరిక లేని షెడ్యూల్ లో క్రికెటర్లు తిరుగుతున్నారు. విరామం లేకుండా ఇలా ఆడిస్తే, రేపు పొట్టి వరల్డ్ కప్ లో సరిగ్గా పెర్ ఫార్మ్ చేయగలరా? అని నెట్టింట అప్పుడే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బీసీసీఐ  పక్కా కమర్షియల్ గా మారిపోయింది. మరి వారి చెవులకి ఇవి వినిపిస్తాయా? అంటే డౌటే అని చెబుతున్నారు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×