EPAPER

Kurnool: జైలు దగ్గర హృదయవిదారక దృశ్యం.. తల్లికోసం తల్లడిల్లిన కుమార్తె

Kurnool: జైలు దగ్గర హృదయవిదారక దృశ్యం.. తల్లికోసం తల్లడిల్లిన కుమార్తె

Kurnool: అక్కడ తల్లి ఉందని తెలిసినా.. కనిపించని పరిస్థితి. మాట్లాడటానికి వీలులేని దుస్థితి. ఏమైందో కూడా తెలుసుకోలేని పసి వయసు. తల్లి ఎందుకు రాదో, ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కాక.. అమ్మ కోసం ఆ చిన్నారి పడే ఆవేదన చూస్తే.. ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ జైలు గేటు దగ్గరే వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ హృదయవిదారక దృశ్యం కర్నూల్ సబ్ జైల్ వద్ద కనిపించింది.


కర్నూలు పాత బస్తీకి చెందిన ఓ మహిళ చోరీ కేసులో అరెస్టైంది. దీంతో పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తల్లిని అరెస్టు చేసి జైలుకు తరలించడంతో.. ఆ చిన్నారి దిక్కులేనిదైంది. జైలు గేటు కొడుతూ అమ్మా రావా అంటూ పిలుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు.. తల్లితో కుమార్తెను కలిపించారు. అనంతరం పోలీసులు ఆ బాలికను బంధువులకు అప్పగించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×