EPAPER

Vijayakanth : కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల ఆందోళన

Vijayakanth :  కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల ఆందోళన

Vijayakanth : కోలీవుడ్ లో ‘కెప్టెన్’ విజ‌య్ కాంత్ ఒక మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఒకప్పుడు మిలటరీ కి సంబంధించిన సినిమాలు తీయాలి అంటే విజయ్ కాంత్ తర్వాతే అనేవాళ్ళు. ఆయన తీసే యాక్షన్ సినిమాలతో 80-90 మధ్య దశకంలో మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 150 కి పైగా చిత్రాలు చేసి లెజెండరీ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యాక్టర్ ఇటు ప్రజాసేవలో కూడా తనదైన ముద్ర వేశాడు.


రాజకీయాల్లోకి దిగిన తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజల కోసం తనకు చేతనైనంత సేవ అందించారు. తమిళనాడు ప్రజాసేవకుడిగా ప్రజల ఆదరాభిమానం పొందాడు. గత కొద్ది కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేని విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో గత 20 రోజులుగా హాస్పిటల్ లోనే సుదీర్ఘ చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం పై కొన్ని మీడియా సంస్థలు పలు రకాల కథనాలు కూడా ప్రచురించాయి. ఒక టైం లో ఆయన చనిపోయాడు అని కూడా ప్రచారం చేశారు.

ప్రస్తుతం ఆరోగ్యం స్థిరపడడంతో ఆయన ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను పార్టీ కి సంబంధించిన ఒక కార్యక్రమానికి తీసుకువచ్చారు. బక్క చిక్కిపోయిన శరీరంతో.. కుర్చీలో కదలని స్థితిలో ఉన్న విజ‌య్ కాంత్ ని చూసి పార్టీ కార్యకర్తలు ..అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. కనీసం కుర్చీలో కూడా ఆయన స్థిరంగా కూర్చోలేకపోవడం.. చూడడానికి బాధాకరంగా ఉంది. కార్యక్రమం ముగిసే అంతవరకు అతని పక్కన వేరొక వ్యక్తి కూర్చొని పట్టుకుంటే కానీ ఆయన కూర్చోలేకపోయారు. నా అభిమాన హీరోని ఇలా చూడాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు అని అభిమానులు వాపోతున్నారు.డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా విజయ్ కాంత్ భార్య ప్రేమలత ఎన్నిక కాబడ్డారు.


Related News

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×