EPAPER

Vyooham Trailer 2 : ఆర్జీవి వ్యూహం.. సెకండ్ ట్రైలర్ సంచలనం..

Vyooham Trailer 2 : ఆర్జీవి వ్యూహం.. సెకండ్ ట్రైలర్  సంచలనం..
Vyooham Trailer 2

Vyooham Trailer 2 : టాలీవుడ్ లో కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అగ్గిరాజుకుంటున్న ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఓ సినిమాని అతను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వ్యూహం అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయిన తర్వాత..  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ను కూడా జారీ చేసింది.


వ్యూహం సినిమాను ఈనెల ఆఖరిలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా తొక్కేసిన మనిషి ఇప్పుడు పైకే పోయాడు. ఇక అంతా మీరే.. అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఓదార్పు యాత్ర అంటూ జనం వచ్చింది నాన్న మీద ప్రేమతో కాదు.. ఆయన మరణం తర్వాత కోట్ల మంది నాపై పెట్టుకున్న ఆశకు నేను చలించి పోయాను.. అనే డైలాగ్ తో వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ట్రైలర్ లో ప్రస్తావించారు. భారీ డైలాగులతోపాటు.. ఒక విషయంలో నిజమా అబద్దమా తెలియాలి అంటే జీవితకాలం సరిపోదు.. క్షవరం అయితే కానీ వివరం తెలియదు.. లాంటి సెటైరికల్ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.


సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. ఇలాంటి అంశాలు ఉన్నాయి అనడానికి ఇండికేషన్ గా.. ట్రైలర్ లో వీటి గురించి చూపించారు. ఇక ట్రైలర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోపాటు చిరంజీవి పాత్రలను కూడా చూపించారు. ఇక ఆర్జీవి ఈ సినిమా కోసం పాడిన ఒక పాటను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి హైలెట్ చేశారు.

నా వెనక ఉండే నీకు నేను చెప్పేది అర్థం కాదు తమ్ముడు.. అని చిరంజీవి పవన్ కళ్యాణ్ తో అనడం.. అది విని పవన్ కళ్యాణ్ కోపంగా వెళ్తున్నప్పుడు.. కొత్త పార్టీ పెట్టేలా ఉన్నాడు అంటూ చిరంజీవి పక్కన ఉన్న వ్యక్తి చెప్పడం లాంటి సీన్స్ చూపించారు.

ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ జరిగిన ప్రచారాన్ని హైలైట్ చేసే విధంగా.. నువ్వు నా గురించి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యి ..మీకు ఒక మంచి ప్యాకేజీ ఇస్తాను.. అని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తో చెప్పే డైలాగ్ కూడా ఉంది. మొత్తానికి ఇందులో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ పాత్రలను బాగా నెగిటివ్ గా చూపించడానికి ఆర్జీవి ప్రయత్నించాడు అని అర్థం అయిపోతుంది. ట్రైలర్లో పొలిటికల్ డైలాగ్స్ బాగా పేలాయి కానీ దీనిపై అభ్యంతరాలు కూడా అలాగే వ్యక్తం అవుతున్నాయి. మరి ముందు ముందు ఈ ట్రైలర్ ఎంత రచ్చ సృష్టిస్తుందో చూడాలి.

.

.

Related News

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Big Stories

×