EPAPER

IND vs SA 3rd T20: సౌతాఫ్రికాపై టీమిండియా సూపర్ విక్టరీ.. బ్యాట్ తో సూర్య, బాల్ తో కులదీప్ విజృంభణ

IND vs SA 3rd T20: సౌతాఫ్రికాపై టీమిండియా సూపర్ విక్టరీ.. బ్యాట్ తో సూర్య, బాల్ తో కులదీప్ విజృంభణ

IND vs SA 3rd T20: సౌతాఫ్రికాపై నిర్ణయాత్మకమైన మూడో టీ 20లో టీమ్ ఇండియా జూలు విదిల్చింది. సూపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ గా తనపైన టీమ్ మేనేజ్మెంట్ పెట్టిన నమ్మకాన్ని సూర్యకుమార్ యాదవ్ వమ్ము చేయలేదు. 56 బాల్స్ లో 8 సిక్స్ లు, 7 ఫోర్ల తో కరెక్టుగా 100 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు. మరోవైపు బౌలింగ్ లో 5 వికెట్లు తీసి కులదీప్ యాదవ్ సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. దీంతో ఇద్దరూ అటూ, ఇటూ కుడి ఎడమలుగా కలిసి టీమ్ ఇండియాకు సూపర్ విక్టరీ అందించారు.


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో సౌతాఫ్రికా ఘోరంగా విఫలమై 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఓపెనర్లు కొంత ఆశావాహ ద్రక్పథంతో బ్యాటింగ్ ప్రారంభించింది. శుభ్ మన్ గిల్ (8) పరుగులు చేసి 29 పరుగుల దగ్గర ఎల్ బీ డబ్ల్యూగా కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ అదే ఓవర్ లో తర్వాత బాల్ కే అవుట్ అయ్యాడు. సౌతాఫ్రికా హ్యాట్రిక్ కోసం ఎదురు చూసిన దశలో కెప్టెన్ సూర్య దిగాడు.


ఒక్కసారి ఆట స్వరూపమే మారిపోయింది. వికెట్లు పడుతున్నా పిచ్ సహకరించకపోయినా పట్టించుకోలేదు. ఎడాపెడా దంచి కొట్టాడు. ఈ బౌలర్, ఆ బౌలర్ అని లేదు. అందరికీ వరసపెట్టి వడ్డించేశాడు. మళ్లీ ఒకప్పటి సూర్యని గుర్తు చేశాడు. తనని స్కై అని ఎందుకంటారో అందరికీ ఒకసారి గుర్తు చేశాడు.

నిజంగానే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 సిక్స్ లు, 7 ఫోర్లతో కరెక్టుగా 100 పరుగులు చేశాడు.
చివరి ఓవర్ లో షాట్ కొట్టి లాంగ్ లెగ్ లో దొరికిపోయాడు. ఈ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమేకాదు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.

సూర్యకి సపోర్ట్ గా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అండగా నిలిచాడు. తను కూడా 41 బాల్స్ లో 3 సిక్స్ లు, 6 ఫోర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ (14) త్వరగానే అవుట్ అయ్యాడు. తను అవుట్ కాగానే సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎగిరి గంతేశారు. సగం విజయం సాధించినంతగా ఫీలయ్యారు. అంటే రింకూ సింగ్ ఎంతో ప్రభావంతంగానే కాదు, ప్రత్యర్థులకి ప్రమాదకరంగా కూడా మారాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

చివర్లో రన్స్ పెంచే క్రమంలో షాట్లు కొడుతూ మిగిలిన వాళ్లు అవుట్ అయిపోయారు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ హిట్ వికెట్ గా వెనుతిరిగాడు. బాల్ ని కొట్టాడు. అది ఫోరు కూడా వెళ్లింది. కాకపోతే తన కాలితో తానే వికెట్లను తన్నేసుకున్నాడు. దీంతో హిట్ వికెట్ గా ప్రకటించారు. దాంతో తను కొట్టిన ఫోర్ రన్స్ ఇవ్వలేదు. చివరికి టీమ్ ఇండియా 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది.

సౌతాఫ్రికా బౌలింగ్ లో కేశవ్ మహారాజ్ 2, విలియమ్స్ 2, షంశీ 1, బర్గర్ 1 వికెట్లు తీశారు.

లక్ష్య చేధనలో సౌతాఫ్రికా చాలా స్పీడుగా వచ్చింది. మొన్న జరిగిన రెండో టీ 20లో ఆడినట్టు ఆడేద్దామని అంతా అనుకున్నారు. ఆ ఛాన్స్ మన బౌలర్లు ఈసారి ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే రన్ రేట్ పెంచే క్రమంలో తొందరపడి అవుట్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ కులదీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం కూడా చెప్పాలి. మొత్తం 5 వికెట్లు తీసి సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. ఇక సౌతాఫ్రికా బ్యాటింగ్ చూస్తే
కప్టెన్ మార్ క్రమ్ (25), డేవిడ్ మిల్లర్ (35), డోనోవన్ ఫెరైరా (12) వీరే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన వాళ్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. త్తానికి 13.5 ఓవర్లలో 95 పరుగుల వద్ద సౌతాఫ్రికా కథ ముగిసింది.

అటు బ్యాటింగ్ లో సూర్య ది గ్రేట్ అయితే, ఇటు బౌలింగ్ లో కులదీప్ గ్రేట్ అనిపించుకున్నాడు. టీమ్ ఇండియా బౌలింగ్ లో సిరాజ్ 1, ముఖేష్ కుమార్ 1, అర్షదీప్ 1, రవీంద్ర జడేజా 2, కులదీప్ యాదవ్ 5 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో తొలిసారిగా తిలక్ వర్మ బౌలింగ్ చేయడం విశేషం.

ఎలాగైతేనే సౌతాఫ్రికా చేతిలో సిరీస్ పెట్టకుండా 1-1తో సమం చేసి, గౌరవప్రదంగా టీ20 టీమ్ బయటపడింది. ఇక వన్డే టీమ్ వంతు ఉంది. మరి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×