EPAPER

Attack on Parliament | పార్లమెంటు వద్ద లైవ్‌లో గొడవపడిన రిపోర్టర్లు.. గ్యాస్ క్యాన్ కోసం తోపులాట!

Attack on Parliament | పార్లమెంటు లోక్ సభలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరు దుండుగులు గ్యాన్ క్యాన్ (Gas Cannister) ప్రయోగించి దాడిచేశారు. ఆ ఇద్దరు దుండగులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే దుండగులు ఉపయోగించిన గ్యాస్ క్యాన్ మాత్రం పార్లమెంటు బయట దొరికింది.

ఈ ఘటన తరువాత పార్లమెంటు బయట ఉన్న వివిధ మీడియా రిపోర్టర్లు తమ ఛానెళ్లకు త్వరగా వీడియో సమాచారం అందించేందుకు గొడవపడ్డారు. దుండగులు ఉపయోగించిన గ్యాస్ క్యాన్ ఒక మీడియా రిపోర్టర్ చేతికి చిక్కింది. అతను ఆ గ్యాస్ క్యాన్ ఎలా పనిచేస్తుందో కెమెరా ముందు వివరిస్తూ.. వీడియో రికార్డ్ చేస్తుండగా.. మిగతా ఛానెళ్ల రిపోర్టర్లు కూడా ఆ గ్యాస్ తమకు ఇవ్వాల్సిందిగా అతడిని అడిగారు. కానీ అతను మాత్రం వారిని పట్టించుకోలేదు.

దీంతో మిగతా న్యూస్ ఛానెళ్ల రిపోర్టర్లు ఆ మొదటి రిపోర్టర్ చేతిలో నుంచి గ్యాస్ క్యాన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రిపోర్టర్ల మధ్య తోపులాట జరిగింది. ఇదంతా లైవ్ న్యూస్‌గా ప్రసారం అయిపోయింది. పైగా చుట్టూ ఉన్న జనమంతా వారిని చూసి నవ్వుతున్నారు. సమాజానికి నీతులు చెప్పే రిపోర్టర్లు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×