EPAPER

Vishnu Deo Sai | ఛత్తీస్‌గఢ్‌ సిఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ పేరు ఖరారు

Vishnu Deo Sai | ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ పేరును బిజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బిజేపీ ఎమ్మేల్యేలు ఆదివారం సమావేశమై విష్ణుదేవ్‌ సాయ్‌‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

Vishnu Deo Sai | ఛత్తీస్‌గఢ్‌ సిఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ పేరు ఖరారు
Vishnu Deo Sai News

Vishnu Deo Sai News(Latest political news in India):

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ పేరును బిజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బిజేపీ ఎమ్మేల్యేలు ఆదివారం సమావేశమై విష్ణుదేవ్‌ సాయ్‌‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తరువాత బిజేపీ కేంద్ర పరిశీలకులు శర్వానంద సోనోవల్‌, అర్జున్‌ముండా, దుష్యంత్‌ గౌతమ్‌లు సాయ్‌ పేరును ప్రకటించారు. విష్ణుదేవ్‌ సాయ్ గతంలో బిజేపీ ఛత్తీస్ గఢ్ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతుల నిర్వహించారు.


విష్ణుదేవ్‌సాయ్‌ ఎవరు?
ఛత్తీస్ గడ్‌లో బిజేపీ సీనియర్ నాయకుడైన విష్ణుదేవ్‌సాయ్‌ 2020 నుంచి 2022 వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో రాయ్‌గఢ్‌ నియోజకవర్గం ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో జాష్పుర్‌ జిల్లా కుంకురి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సిఎంగా విష్ణుదేవ్‌సాయ్‌ ఎందుకు?


రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా ఉంది. అయితే విష్ణుదేవ్‌సాయ్‌ ఆదివాసీ వర్గానికి చెందినవారు. విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్న జాష్పుర్ జిల్లాకు ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీలను బిజేపీ తనవైపు తిప్పుకునేందుకు విష్ణుదేవ్‌సాయ్‌‌ని ముఖ్యమంత్రి పదవి అప్పగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు విష్ణుదేవ్ సాయ్ అత్యంత సన్నిహితుడు కావడం కూడా ఆయనను సిఎంగా ఎన్నుకోవడానికి ఒక కారణం.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత అజిత్‌ జోగి తొలి ఆదివాసీ సీఎం అయ్యారు. ఇప్పుడు సుదీర్ఘకాలం తరువాత విష్ణుదేవ్‌సాయ్‌ రూపంలో మరో ఆదివాసీకి అవకాశం లభించింది.

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×