EPAPER

CM Revanth Reddy Visits KCR : కేసీఆర్‌కు సర్జరీ.. ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Visits KCR : కేసీఆర్‌కు సర్జరీ..  ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Visits KCR : సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కాలుజారి కిందపడి తుంటి ఎముక విరగడంతో.. సోమాజిగూడ యాశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు సర్జరీ చేశారు. తుంటి ఎముక విరిగి చికిత్సపొందుతున్న కేసీఆర్‌ను ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు రేవంత్‌రెడ్డి.


గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారి కింద పడ్డారు మాజీ సీఎం కేసీఆర్‌. దీంతో ఆయనకు గాయాలు కావడంతో హుటా హుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ పరీక్షలు జరిపిన డాక్టర్లు తుంటి ఎముక విరిగిందని నిర్ధారించి, సర్జరీ చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఎర్రవల్లి నుంచి ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసారు. హెల్త్ సెక్రటరీని యశోద ఆసుపత్రికి పంపారు సీఎం రేవంత్‌రెడ్డి.


ముఖ్యమంత్రి ఆదేశాలతో.. యశోద హాస్పిటల్ కు వెళ్లారు ఆరోగ్యశాఖ కార్యదర్శి. అక్కడి వైద్యులను కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి తెలిపారు యశోద వైద్యులు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి పరామర్శించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×