EPAPER

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి.. ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరణ

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి.. ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరణ

Minister Komatireddy: రోడ్డు, భవనాలశాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఐదవ అంతస్తులో మంత్రి కోమటిరెడ్డి ఛాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోమటిరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకం చేశారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.


తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయఢంకా మోగించడంతో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం సహా మంత్రులంతా ప్రమాణస్వీకారం అనంతరం వారి బాధ్యతల్లో నిమగ్నులయ్యారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అంటే.. వైఎస్‌ఆర్‌ పాలనలో తొలిసారి మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు కోమటిరెడ్డి. ఆయ‌న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి అధికార ప్ర‌భుత్వంపై పోరాడిన మొద‌టి వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నాడు.

.


.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×