EPAPER

Principal Secretary Seshadri | ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి..రేవంత్ రెడ్డి నిర్ణయం సరియైనదేనా?

Principal Secretary Seshadri | తెలంగాణ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రిని నియమించుకున్నారు. 1999 బ్యాచ్‌కు చెందిన IAS అధికారిని రేవంత్‌ తన టీంలోకి ఎందుకు తీసుకున్నారు? ఇంతకీ ఆ శేషాద్రిని రేవంత్‌ ఎందుకు నమ్మాల్సి వచ్చింది?

సీఎంవో. నిత్యం వందల సంఖ్యలో లెటర్లు, అప్లికేషన్లు వస్తాయి. వాటన్నింటినీ స్క్రూటీని చేసి సీఎం వద్దకు చేర్చాలి. అంతేకాదు.. ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీఎంవో అధికారులే గ్రౌండ్‌వర్క్‌ చేస్తారు. ఇలాంటి పనులన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఐదుగురి నుంచి పది మంది IAS అధికారులు పనిచేస్తారు. వారందరి మీద సీఎంవో ముఖ్య కార్యదర్శి ఉంటారు. అంటే సీఎంవోకు ఆయనే బాస్‌. అలాంటి వ్యక్తిని ఏ సీఎం అయినా.. ఆచితూచి ఎంపిక చేసుకుంటారు. సరిగ్గా అలాగే చేశారు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

ఆయనో నిజాయితీ గల అధికారి..

సీనియర్ IAS గా ఉన్న శేషాద్రికి చాలా నిజాయితీ అధికారిగా పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా ఎలాంటి మరకలు లేవు. అందుకే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే రేవంత్ రెడ్డి ఆయన్ను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. శేషాద్రితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని అపాయింట్ చేశారు. శేషాద్రి మోస్ట్ కమిటెడ్ ఆఫీసర్. అందుకే ఆయన ట్రాక్ రికార్డ్ చాలా క్లియర్. శేషాద్రి ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు.

దీనికి ముందువరకు కూడా ఆయన సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శిగా.. సీఎంవో కార్యదర్శిగా ఉన్నారు. శేషాద్రికి రెవెన్యూ చట్టాలు, భూ వ్యవహారాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది. ప్రత్యేకించి తెలంగాణలోని భూములు, రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి అని టాక్‌ ఉంది. కేసీఆర్‌ పాలనలో రూపొందించిన ధరణి పోర్టల్‌ లో ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతకుముందు రంగారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గానూ పనిచేశారు. కొద్దికాలం కేంద్ర సర్వీసుల్లోనూ విధులు నిర్వర్తించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో శేషాద్రి.. పీఎంవోలోనూ పనిచేశారు. తర్వాత.. మోడీ కూడా కొద్దికాలం పాటు శేషాద్రిని తన టీంలోనే ఉంచుకున్నారంటే ఆయన కమిట్‌మెంట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అవినీతి లేకుండా అతను పనిచేశారని ట్రాక్ రికార్డ్ చెబుతోంది. అందుకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే శేషాద్రిని సీఎం రేవంత్‌ రెడ్డి తన టీంలోకి తీసుకున్నారు. కింది స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేయడం, ఇచ్చిన పనిని ఫాలో అప్ చేసుకునే సద్గుణం శేషాద్రిలో ఉన్నాయని సహచర ఆఫీసర్లే చెబుతుంటారు.

తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ ప్రక్షాళన చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రచారంలో భాగంగా పదేపదే చెప్పారు. అయితే ఆ ధరణి పోర్టల్‌ రూపకల్పనలో కీలకంగా ఉన్న శేషాద్రిని ఇప్పుడు తన సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నియమించుకోవడంతో సీఎం రేవంత్‌ ఆ పనిని అతనికే అప్పగించినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా శేషాద్రి సిన్సియారిటీ, డెడికేషన్‌ను కచ్చితంగా సీఎం రేవంత్‌ రెడ్డి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటారన్నది క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×