EPAPER

Animal Movie | యానిమల్ సినిమాపై పార్లమెంటులో నిప్పులు చెరిగిన మహిళా ఎంపీ

Animal Movie | తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. మహిళలను అగౌరవంగా చూపించారని కొందరు చెబుతుంటే.. మరికొందరు హింసను ప్రేరేపించేవిధంగా సినిమా ఉందని ఘాటు విమర్శులు చేస్తున్నారు

Animal Movie | యానిమల్ సినిమాపై పార్లమెంటులో నిప్పులు చెరిగిన మహిళా ఎంపీ

Animal Movie | తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. మహిళలను అగౌరవంగా చూపించారని కొందరు చెబుతుంటే.. మరికొందరు హింసను ప్రేరేపించేవిధంగా సినిమా ఉందని ఘాటు విమర్శులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా గురించి పార్లమెంటు రాజ్యసభలో ఛత్తీస్ గఢ్ మహిళా ఎంపీ రంజిత్ రంజన్ మాట్లాడారు.


యానిమల్ సినిమాలో హింసను మితిమీరి చూపించారని.. మహిళలను అవమానించే విధంగా సినిమా ఉందని మండిపడ్డారు. అసలు ఇటువంటి సినిమాలని సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తోందని నిలదీశారు. సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉండడంతో ఎక్కువమంది చూస్తున్నారని.. ముఖ్యంగా యువత సినిమాలోని క్రిమినల్ హీరోని ఒక ఆదర్శంగా భావిస్తున్నారని మండిపడ్డారు. యానిమల్, పుష్ప, కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) పాత్రలను యువత ఆదర్శంగా తీసుకుంటే మన సమాజం నాశనమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ ఉన్నా.. కుటుంబ సమేతంగా సినిమాహాళ్లకు వెళుతున్నారు. సినిమాలో హీరో తన భార్యతో ఎలా వ్యవహరిస్తాడో చూసి ప్రభావితమవుతున్నారు. ఇది మన సమాజానికి, కుటుంబాలకు మంచిది కాదు. ఇంటర్ చదివే విద్యార్థులు హీరో ఎవరినీ లెక్కచేయకుండా ఉంటాడో చూసి అది ఇష్టపడుతున్నారు. వారంతా పెడదారిన పడే ప్రమాదం ఉంది. ‘ఇలాంటి సినిమాలు మన సమాజానికి క్యాన్సర్ వ్యాధి లాంటివి,” అని వ్యాఖ్యానించారు.


Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×