EPAPER

Sonia Gandhi Birthday : గాంధీభవన్‌లో సోనియా బర్త్‌డే వేడుకలు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..

Sonia Gandhi Birthday : గాంధీభవన్‌లో సోనియా బర్త్‌డే వేడుకలు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..

Sonia Gandhi Birthday : కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 78వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ఆమె పుట్టినరోజును కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్‌ చేస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ గ్రాండ్‌గా జరిపేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధమయ్యారు. తెలంగాణ తల్లిగా పేరొందిన సోనియాగాంధీకి విషెస్‌ చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి హస్తం పార్టీ కూడా సోనియాగాంధీకి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చింది.


రాష్ట్రం ఏర్పడిన దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. 2014లో తెలంగాణ ఏర్పడినా కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం లాభం కలుగలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటమి చవిచూసింది. 2018లోనూ ఇదే సీన్‌ రిపీట్ అయ్యింది. కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టాక పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచి సోనియాగాంధీకి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇస్తామని శపథం చేశారు. అనుకున్నవిధంగానే పార్టీని విజయతీరాలకు చేర్చి మాట నిలబెట్టుకున్నారు. సోనియాగాంధీకి పుట్టినరోజు కానుక ఇచ్చారు. ఆమె కలను నిజం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని సోనియాగాంధీ కోరిన మాటను ప్రజలు గౌరవించారు. హస్తం పార్టీకి విజయం చేకూర్చారు. దీనికి కృతజ్ఞతగా ఇప్పటికే సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీ కుటుంబమంతా హాజరయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ భారీ ఎత్తున సెలబ్రేషన్స్‌ చేయనున్నారు కాంగ్రెస్‌ శ్రేణులు. గాంధీభవన్‌ వద్ద వేడుకల కోసం సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్‌తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రధాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపనున్నారు.


రాష్ట్రం నలుమూలలా సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలు జరుపనున్నారు. ఇవాళే సోనియాగాంధీ బర్త్‌ డే సందర్భంగా ప్రభుత్వం రెండు గ్యారంటీలను అమల్లో పెట్టనుంది. 2009లో ఇదేరోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ తల్లిగా పేరు పొందారు సోనియాగాంధీ. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా మాటమీద నిలబడ్డారు సోనియాగాంధీ. అందుకే ఆమెకు పుట్టిన రోజు కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలు కానుక ఇచ్చారు.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×