EPAPER

IPL 2024 : గుజరాత్ టైటాన్స్ నుంచి షమీ కూడా అవుటా?

IPL 2024 : గుజరాత్ టైటాన్స్ నుంచి షమీ కూడా అవుటా?

IPL 2024 : గుజరాత్ టైటాన్స్ జట్టులో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ సీవోవో అరవింద్ సింగ్ ఒక సెన్సేషన్ న్యూస్ లీక్ చేశాడు. ఆ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న మహ్మద్ షమీని వేరే ఫ్రాంచైజీ వాళ్లు అడిగారని తెలిపాడు. అయితే షమీ మరిక్కడే కొనసాగుతాడా? లేక వేరే జట్టుకి వెళతాడా? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను వదులుకున్న గుజరాత్ టైటాన్స్ మరి స్టార్ బౌలర్ మహ్మద్ షమీని వదులుకుంటుందా? లేదా? అనేది చూడాలి.


గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టి రెండేళ్లే అవుతుంది. అందులో మొదటి ఏడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో కప్పు గెలిచింది. రెండో ఏడాది ఫైనల్ వరకు వెళ్లింది. అంత అద్భుతమైన టీమ్ లోని ఆటగాళ్లను గుజరాత్ టైటాన్స్ వదులుకోవడంపై విమర్శలు రేగుతున్నాయి. అయితే షమీ విషయంలో అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

ఎందుకంటే ఫ్రాంచైజీలు కొన్ని డైరక్టుగా ఆటగాళ్లను సంప్రదిస్తున్నాయి. కొన్నిచోట్ల కోచింగ్ స్టాఫ్ టచ్ లోకి వెళుతున్నాయని, ఇది కరెక్ట్ కాదని గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అర్విందర్ సింగ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ నిజంగా ఫ్రాంచైజీలకు ఇతర జట్ల ఆటగాళ్లు కావాలంటే, వారు బీసీసీఐకి దరఖాస్తు చేయాలి. వారు సంబంధిత ఫ్రాంచైజీకి పంపిస్తారు. అప్పుడా ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇతర ఫ్రాంచైజీ వాళ్లు ఇలా చేయడం తప్పు అని, ఎవరైనా సరే, నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని చెబుున్నారు.


ఇప్పుడు అరవింద్ సింగ్ చెప్పినదాన్ని బట్టి చూస్తే, వీరికి షమీని వదులకోవడం ఇష్టంలేదని తేలింది. కాకపోతే అవతల ఫ్రాంచైజీ ఇచ్చే ఆఫర్ టెంప్టింగ్ గా ఉంటే మాత్రం హార్దిక్ పాండ్యాలా వదిలేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ డైలాగులవీ ఇప్పటివరకే ఉంటాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఒక టీమ్ షమీ కోసం సంప్రదించిందనే విషయాన్ని అర్విందర్ సింగ్ చెప్పకనే చెప్పాడు. అయితే వారెవరు? అనేది మాత్రం బయటపెట్టలేదు. విషయం తెలిసిన నెటిజన్లు ఊరుకుంటారా? ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేశారు.
అయితే ఎవరా అజ్నాత వ్యక్తి అనే సంగతి ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో షమీ జట్టును మారబోతున్నాడా? అనే ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి.

ఆటగాళ్లకు సంబంధించి రీటెన్షన్, రిలీజ్‌కు సంబంధించిన గడువు ముగిసి పోయింది. కానీ ప్లేయర్లను ట్రేడింగ్ చేసుకోడానికి మాత్రం డిసెంబర్ 12 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో షమీ.. గుజరాత్ టైటాన్స్‌లోనే ఉంటాడా? మారతాడా? అనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×