EPAPER

Extra Ordinary Man Review : ఎక్స్ట్రా కామెడీ తో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మాన్ .. సినిమా ఎలా ఉందంటే ..

Extra Ordinary Man Review : ఎక్స్ట్రా కామెడీ తో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మాన్ .. సినిమా ఎలా ఉందంటే ..
Extra Ordinary Man Review

Extra Ordinary Man Review : గత కొంతకాలంగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న యంగ్ హీరో నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి థియేటర్లకు వచ్చేసాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలుసుకుందాం..


మూవీ: ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్

నటీనటులు : నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్.


నిర్మాత : ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి

డైరక్టర్ : వక్కంతం వంశీ

సంగీతం : హారిస్ జయరాజ్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 8, 2023

కథ:

కామెడీ బాగా వర్క్ అవుట్ అయినప్పటికీ కొన్నిచోట్ల కాస్త ఓవర్ అనిపిస్తుంది. అయితే డైలాగ్స్ మాత్రం మీమర్స్ కు బాగా నచ్చే విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ స్టోరీ నార్మల్ గా సాగినా .. కామెడీ మాత్రం కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక కథ విషయానికి వస్తే .. జూనియర్ ఆర్టిస్ట్ అయిన నితిన్ హీరో కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని టాలెంట్ నీ కుటుంబంలో అందరూ ప్రోత్సహిస్తారు కానీ అతని తండ్రికి మాత్రం ఇది నచ్చదు. ఇలా సాగిపోతున్న నితిన్ లైఫ్ లోకి లిఖిత (శ్రీ లీల) ఎంటర్ అవుతుంది. అనుకోకుండా నితిన్ కి హీరో ఛాన్స్ వస్తుంది.. అయితే అదే సమయానికి ఒక ఊరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటాడు. తన ప్రమేయం లేకుండా ఆ సమస్యల్లో నితిన్ ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఊరికి ఉన్న సమస్య ఏంటి ?దాన్ని నితిన్ ఎలా పరిష్కరించాడు? రాజశేఖర్ పాత్ర ఏంటి ?తెలుసుకోవాలి అంటే సినిమా చూడండి.

విశ్లేషణ:

బాక్సాఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్టు లేకపోవడంతో.. కాస్త డల్ అయిన నితిన్ ఈసారి తన ఎక్స్ట్రా టాలెంట్ చూపిస్తూ మంచి కామెడీ మూవీ తో భారీ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ నటన ఈ చిత్రంలో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథ ఓ రకంగా ఉన్నప్పటికీ కామెడీ మాత్రం వేరే లెవెల్ లో ఉంది అన్న టాక్ ఈ మూవీ సొంతం చేసుకుంది.ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయిన హీరో లైఫ్ లో ఎదురైన పరిస్థితులు.. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈ స్టోరీ సాగుతుంది.

ఈ మూవీలో శ్రీ లీల చాలా బాగా నటించింది.. మరి మాస్ పాటల్లో శ్రీ లీల స్టెప్స్ మైండ్ బ్లోయింగ్. రాజశేఖర్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ చిన్నప్పటికి.. తన సీనియారిటీ ఎలాంటిదో ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ప్రతి సన్నివేశంలో రాజశేఖర్ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక మూవీ స్టోరీ ట్రైలర్ దాదాపు అంతా అర్థం అవుతుంది. స్టోరీ కొత్తగా లేకపోయినా టేకింగ్ అద్భుతంగా ఉంది.

చివరి మాట: కామెడీ మూవీస్ నచ్చే వాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×