EPAPER

NZ vs BAN : న్యూజిలాండ్ 55/5.. బంగ్లా బౌలర్ల ధాటికి రెండో టెస్టులో విలవిల

NZ vs BAN  : న్యూజిలాండ్ 55/5.. బంగ్లా బౌలర్ల ధాటికి రెండో టెస్టులో విలవిల
NZ vs BAN

NZ vs BAN : వన్డే వరల్డ్ కప్ 2023లో ఎంతో గొప్పగా ఆడి సెమీఫైనల్ వరకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో చచ్చీ చెడి ఆడుతోంది. మొదటి టెస్టులో 150 పరుగుల తేడాతో ఓటమి పాలైన కివీస్ రెండో టెస్టులో అంతకన్నా ఘోరంగా ఆడుతోంది.


రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ వీరికన్నా దారుణంగా ఆడి 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది.

వివరాల్లోకి వెళితే…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 29 పరుగులకే ఓపెనర్లు మహ్మదుల్ హసన్ (14), జకీర్ హుస్సేన్ (8) వికెట్లు పడిపోయాయి, ఇంకాసేపు ఆట సాగిందో లేదో… మోమినల్ (5), కెప్టెన్ షాంటో (9) వారు కూడా వచ్చినంత స్పీడుగా పెవెలియన్ కి వెళ్లిపోయారు. 


తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ముష్ఫికర్ (35), హోస్సేన్ (31) వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. జేమిసన్ వేసిన బంతిని ముష్పికర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పటికి బాల్ ఆగక వికెట్ల మీదకు రావడంతో చేతితో ఆపేసి, అవతలకు విసిరేశాడు.

థర్డ్ అంపైర్ ఏం చేశాడంటే ‘హ్యాండ్లింగ్ ది బాల్’ రూల్ నిబంధన పేరు చెప్పి ముష్ఫికర్ ను ఔట్ గా ప్రకటించాడు. చివరికి ఇటువంటి నిబంధన ప్రకారం అవుట్ అయిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ గా ఒక చెత్త రికార్డుతో ముష్ఫికర్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అలా చివరికి 172 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ కథ ముగిసింది. 

కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు, అజజ్ పటేల్ రెండు, సౌథి ఒక వికెట్ తీశారు.

అనంతరం ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ అనూహ్యంగా వికెట్ల పతనంతో మొదలెట్టింది. బంగ్లా బ్యాటర్లకి ఏ మాత్రం తీసిపోనట్టుగా వీరు ఆడటం ప్రారంభించారు. వీరి మీద అనుభవం లేని వారే నయం అనిపించారు. కనీసం 172 పరుగులైనా చేశారు. వీరు చూస్తే ఇప్పటికే 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు.

 కాన్వాయ్ (11), లాథమ్ (4), నికోలస్ (1), విలియమ్సన్ (13) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. బ్లండెల్ డకౌటయ్యాడు. న్యూజిలాండ్ ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉంది.  ప్రస్తుతం క్రీజులో డేరిల్ మిచెల్ (12), గ్లిన్ ఫిలిప్స్ (5) ఉన్నారు. రెండోరోజు ఆటలో వీరెంత దూరం తీసుకువెళతారోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరి పిచ్ మొదటి రోజు లాగే ఉంటుందా? లేకపోతే రెండో రోజుకి ఇంకా స్వింగ్ అవుతుందా? అనేది తెలీదు. అదే జరిగితే బంగ్లాదేశ్ చేసిన 172 పరుగులే…కీలకంగా మారే అవకాశాలున్నాయి.

బంగ్లా బౌలర్లలో మెహిద్ అసన్ మూడు, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×