EPAPER

Indw vs Engw t20 : తొలి టీ 20.. ఇంగ్లాండ్ అమ్మాయిలు గెలిచారు

Indw vs Engw t20 : తొలి టీ 20.. ఇంగ్లాండ్ అమ్మాయిలు గెలిచారు
Ind vs Eng women's t20

Ind vs Eng women’s t20(Latest sports news telugu) :

మగవాళ్ల క్రికెట్ అయ్యిందనేసరికి, అమ్మాయిల క్రికెట్ మొదలైంది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ ఇండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ 20 మ్యాచ్ ముంబై వాంఖేడీ స్టేడియంలో జరిగింది.
తొలి మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ అమ్మాయిలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 197 పరుగులు చేసింది. భారత్ అమ్మాయిలు 159 పరుగులు మాత్రమే చేయగలిగారు. అలా 38 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.


సొంతగడ్డపై ఆడుతున్న భారత్ అమ్మాయిలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి మ్యాచ్ లో ఓడి సిరీస్ రేస్ లో వెనుకపడ్డారు.

టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట ఇంగ్లాండ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఆ నిర్ణయం సరైనదేనని మొదట్లోనే తేలిపోయింది. ఎందుకంటే బౌలర్ రేణుకా సింగ్ తన వేసిన మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు ఫటాఫట్ మని తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టింది.


ఓపెనర్ డంక్లీ (1), ఆలిస్ కాప్సే (0)ను వరుస బాల్స్ లో బౌల్డ్ చేసింది. ఇంక ఆ దెబ్బకు ఇంగ్లాండ్ కోలుకోవడం కష్టమని అనుకున్నారు. కానీ మరో ఓపెనర్ డేనియల్ వ్యాట్, సెకండ్ డౌన్ వచ్చిన నాట్ సీవర్ ఇద్దరూ నిలబడిపోయారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడం భారత్ అమ్మాయిల వల్ల కాలేదు. దాంతో వాళ్లు నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకున్నారు.

తర్వాత గేర్ మార్చి టీ 20 ఫార్మాట్ లో ఇరగ్గొట్టి వదిలారు. చివరికి డేనియల్ వ్యాట్ (75), నాట్ సీపర్ (77) చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరూ కలిసి 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఎట్టకేలకు 15 ఓవర్ లో సైకా బౌలింగ్ లో సిక్సర్ కొడదామని డేనియల్ క్రీజు దాటింది. దీంతో స్టంప్ అవుట్ అయ్యింది. హమ్మయ్యా అని మనవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అలా 140 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.

తొలి ఓవర్ లో రెండు వికెట్ల తో వచ్చిన బ్రేక్ త్రూని భారత్ బౌలర్లు అందిపుచ్చుకోలేక పోయారు. వికెట్లు చేతిలో ఉండటంతో ఇంగ్లండ్ అమ్మాయిలు చెలరేగిపోయారు. అవుటయ్యేవాళ్లు అవుటయ్యారు. చితక్కొట్టేవాళ్లు చితక్కొట్టారు. అలా హీథర్ నైట్ (6), మరో ఓపెనర్ నాట్ సీపర్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివర్లో వచ్చిన అమీ జోన్స్ 9 బంతుల్లో 23 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

భారత్ బౌలింగ్ లో రేణుకా సింగ్ 3, సైకా ఇస్తాభ్ 1, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు.

తర్వాత 198 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. లక్ష్యం కొండంత కనిపించడం, ప్రతీ ఓవర్ కి తప్పనిసరిగా 10 పరుగులైనా చేయాల్సి రావడంతో భారత్ బ్యాటర్లు ఒత్తిడికి లోనై, అనవసరపు షాట్లు ఆడి చేజేతులారా వికెట్లు పారేసుకున్నారు.

బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే సీనియర్ ప్లేయర్ స్మ్రతి మంథాన (6) త్వరగా అవుట్ అయ్యింది. 20 పరుగులకి తొలి వికెట్ పడింది. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. జెమియా రోడ్రిగన్ (4) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టింది.

అప్పటికి 2 వికెట్ల నష్టానికి 41 పరుగుల మీద  టీమ్ ఇండియా ఉంది. సెకండ్ డౌన్ వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకుంది. మరో ఓపెనర్ షెఫాలి వర్మ తో కలిసి జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మాణాన్ని మొదలు పెట్టింది. అంతా బాగుంది, ఇంక వీరు బ్యాట్ ఝులిపిస్తారనే సమయానికి హర్మన్ ప్రీత్ 26 పరుగులు దగ్గర అవుట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియాకి మళ్లీ బ్రేకులు పడ్డాయి.

అనంతరం వచ్చిన రిచా ఘోష్ (21) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేదు. ఎందుకంటే అవతలవైపు స్కోరు కొండలా పెరిగిపోతోంది. దీంతో తప్పనిసరిగా ఎటాకింగ్ చేయాలి. అప్పుడు రాంగ్ షాట్లు ఆడక తప్పదు. కనీసం పోరాడి ఓడామనే పేరైనా ఉంటుందనే భావనతో అందరూ దూకుడుగానే ఆడారు. తగిలేవి తగిలాయి..లేని వాటికి వికెట్లు పడ్డాయి.

ఈ క్రమంలోనే షెఫాలీ వర్మ 42 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యింది. దీంతో 134 పరుగుల వద్ద భారత్ 5 వికెట్లు కోల్పోయింది. కనికా ఆహుజా (15) కూడా క్లిక్ అవలేదు. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద భారత్ ఆగిపోయింది. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇంగ్లాండ్ బౌలింగ్ లో నాట్ సీపర్ 1, ఫ్రెయాకెంప్ 1, సోఫీ ఎక్సెల్ స్టోన్ 3, సారా గ్లెన్ 1 వికెట్లు తీశారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×