టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే తోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు. ఇప్పటికే 3వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు. స్టేడియం లోపల, బయట పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు.
ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, వీవీఐపీలు, వీఐపీ, సాధారణ ప్రజలు ప్రవేశించడానికి అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 8వ నెంబర్ గేట్ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు. 10వ నెంబర్ గేట్ నుండి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఇస్తుంది. 15, 17 నెంబర్ గేట్ల నుంచి వీవీఐపీలు వెళ్లనున్నారు. SATS, 6, 7, 12, 14 గేట్ల నుంచి ప్రజలు ప్రవేశించనున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో వాహనాల పార్కింగ్‌కి ఏర్పాట్లు చేశారు.