EPAPER

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి.

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి. ఈ తరహా ఘటన ఇప్పుడు బీహార్ లోని అర్రాలో జరిగింది. అయితే చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దొంగలు.


అర్రాలోని సర్క్యూట్ హౌస్ రోడ్‌లో గల యాక్సిస్ బ్యాంక్ లోకి ఈరోజు ఉదయాన్నే పది గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయుధాలతో సిబ్బందిని భయపెడుతూ అందర్నీ ఒక గదిలో బంధించారు. ఇక ప్లాన్ ప్రకారం… బ్యాంకు కౌంటర్లో ఉంచిన 16 లక్షల నగదును తీసుకుని కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి ఉడాయించారు.

అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం దొంగలు ఇంకా బ్యాంకులోనే ఉన్నారని భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు….బయటి నుంచి బ్యాంకును చుట్టుముట్టారు. ఫైరింగ్ జరిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రజలను అక్కడి నుంచి తరలించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్ లతో రెడీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు దొంగలను లొంగిపోవాలని.. లేదంటే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. కానీ వారి నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో చాకచక్యంగా లోపలికి ప్రవేశించిన పోలీసులు…..ఉద్యోగులను సురక్షితంగా బయటికి తీసుకు వచ్చారు. కానీ అప్పటికే దొంగలు తప్పించుకున్నారని.. గుర్తించిన పోలీసులు.. సిబ్బంది సమాచారంతో పొరబడినట్లు గుర్తించారు.


పోలీసులు బ్యాంకు బయట గంటన్నర పాటు వేచి ఉన్న సమయాన్ని దొంగలు సద్వినియోగం చేసుకుని పారిపోయినట్లు వెల్లడించారు. దోపిడీ సమయంలో సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని.. బ్యాంక్ లాకర్ కూడా భద్రంగా ఉందని భోజ్ పూర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నేరస్థుల ఫోటోలు, వీడియోలు లభించాయని.. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బయటకు వెళ్లే సమయంలో అగంతకులు బ్యాంకు ప్రధాన గేటు సీసీ కెమెరాను పగులగొట్టినట్లు తెలుస్తోంది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×