EPAPER

Temba Bavuma : సౌతాఫ్రికా కెప్టెన్ పై వేటు..టెస్ట్ మ్యాచ్ లకే పరిమితం

Temba Bavuma : సౌతాఫ్రికా కెప్టెన్ పై వేటు..టెస్ట్ మ్యాచ్ లకే పరిమితం
Temba Bavuma

Temba Bavuma : వన్డే వరల్డ్ కప్ 2023 లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఘోరంగా విఫలమవడంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, వన్డే జట్టులోంచి కూడా తొలగించింది. టీ 20లో కూడా లేడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ లకి మాత్రమే ఎంపిక చేసింది. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ కప్ తర్వాత బవుమా కెరీర్ ప్రమాదంలో పడినట్టే అంటున్నారు.


సౌతాఫ్రికా వన్డే వరల్డ్ కప్ లో మొత్తం 9 మ్యాచ్ లు ఆడింది. అందులో 8 మ్యాచ్ లు ఆడిన బవుమా కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 35, అదీ ఆస్ట్రేలియా మీద చేశాడు. ఒక కెప్టెన్ అయి ఉండి, జట్టుని ఆదుకోవాల్సిన సమయాల్లో కూడా చేతులెత్తేశాడు. కేవలం ఓపెనర్లు, టాప్ ఆర్డర్ సెంచరీల మీద సెంచరీలు కొట్టడంతో సౌతాఫ్రికా సెమీస్ కి దూసుకెళ్లింది. అదృష్టం కొద్దీ సెమీస్ వరకు బండిని లాక్కెల్లాడు. అక్కడ మాత్రం దురదృష్టం వెంటాడింది.

ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో తను రాణించకపోతే, మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని అంటున్నారు. మరిక్కడ బవుమా ఎలా ఆడతాడనేది చూడాల్సిందే. బవుమా తో పాటు రబడాని కూడా టెస్ట్ మ్యాచ్ లకే పరిమితం చేశారు.


వరల్డ్ కప్ లో కెప్టెన్ బవుమా  పాత్ర నామమాత్రంగా మారడమే కాదు, కెప్టెన్సీ వైఫల్యాల వల్ల కూడా గెలవాల్సిన సెమీఫైనల్ ఓటమి పాలయ్యారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతని ప్లేస్ లో ఎయిడెన్ మార్క్‌రమ్‌కు వైట్ బాల్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.

ఐపీఎల్ స్టార్ ఆటగాడు 20 ఏళ్ల డెవాల్డ్ బ్రేవిస్‌ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడి 506 పరుగులు చేయడమే కాదు, రెండు సెంచరీలు, మూడు ఆఫ్ సెంచరీలు కూడా చేశాడు. అయినా సరే, టీ 20 ప్రపంచకప్ లో క్రికెట్ సౌతాఫ్రికా అవకాశం కల్పించలేదు. తొలి సారి సౌతాఫ్రికా జట్టులో నాంద్రే బర్గర్ కి అవకాశం కల్పించారు.

 మల్టీ ఫార్మాట్ల సిరీస్‌ని ‘ఫ్రీడమ్ సిరీస్‌’గా నామకరణం చేశారు. డిసెంబర్ 10 నుంచి 14 వరకు మూడు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా.. డిసెంబర్ 17 నుంచి 23 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

Related News

IND vs NZ: విరాట్ కోహ్లీ మరో రికార్డు…9000 టెస్ట్ పరుగులు క్రాస్ !

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట..రాణించిన కోహ్లీ , సర్ఫరాజ్

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Big Stories

×