EPAPER

Kalva Srinivasulu | 74 మంది బీసీల హత్య.. దళిత పథకాల రద్దు.. ఇదీ వైసిపీ ఘనత : మాజీమంత్రి

Kalva Srinivasulu | నాలుగేళ్లుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీమంత్రి టిడిపి సీనియర్ నాయకులు కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసి.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టిందని ఎద్దేవా చేశారు.

Kalva Srinivasulu | 74 మంది బీసీల హత్య.. దళిత పథకాల రద్దు.. ఇదీ వైసిపీ ఘనత : మాజీమంత్రి

Kalva Srinivasulu | నాలుగేళ్లుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీమంత్రి టిడిపి సీనియర్ నాయకులు కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసి.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టిందని ఎద్దేవా చేశారు.


అది సామాజిక సాధికర యాత్ర కాదు.. మోసగాళ్ల యాత్ర అని ధ్వజమెత్తారు. వైసీపీ మోసగాళ్ళంతా కలిసి సామాజిక బస్సు యాత్ర చేయడం హస్యాస్పదమన్నారు. వైసీపీ పాలనలో బలహీన వర్గాల ధన, మాన, ప్రాణాలకు విలువ లేదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు సినిమాలో విలన్ పాత్రలని పోషిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ఒక విలన్ అని మండిపడ్డారు.

74 మంది బీసీలను హత్య చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత పథకాలను రద్దు చేసి.. రిజర్వేషన్‌లను తగ్గించిన ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. దళితులను అన్యాయంగా చంపి డోర్ డెలివరీ వైసీపీ ప్రభుత్వం చేసిందని.. అసలు హత్యలు చేసిన వారే సానుభూతి వ్యక్తం చేస్తున్నారని సెటైర్లు వేశారు.


కుహనా మేధావులు అంత ప్రజల ముందుకు వస్తున్న మంత్రి మేరుగ నాగార్జున లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు రెడ్ల చేతిలో చిక్కిపోయిందన్నారు. ఆ నలుగురే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో… ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో నిర్ణయించేది కూడా వారేనని చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని రెడ్లకు పాదాక్రాంతం చేసిందని.. అలాంటి వైసిపీ సామాజిక సాధికారత గురించి మాట్లాడేందుకు హక్కు ఉందా? అని ప్రశ్నించారు.

వైసీపీ ది సామాజిక బస్సు యాత్ర కాదు దగాకోరుల దండయాత్ర. ఈ వైసీపీ నయవంచకులకు బుద్ది చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులారా మీకు ఆత్మాభిమానం లేదా? ఈ బస్సుయాత్రను రాయదుర్గంలో తుస్సుమంటుందని.. వైసీపీ మోసగాళ్లకు బుద్ధి చెప్పాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Tags

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×