EPAPER

AP Telangana water Dispute | ముదురుతున్న జలవివాదం.. కృష్ట బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ

AP Telangana water Dispute | ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఉంది. అయితే ఈ వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

AP Telangana water Dispute | ముదురుతున్న జలవివాదం.. కృష్ట బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ
AP Telangana water Dispute

AP Telangana water Dispute(Telugu news live today):

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఉంది. అయితే ఈ వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.


నవంబర్ 29న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఓ లేఖ రాసింది. ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్ననిర్ణయం మేరకు నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వమే నియంత్రించేలా అనుమతులివ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారా మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

అందుకోసం నవంబర్ 28 తేదీకి ముందున్న లేక ఘర్షణ జరిగక మునుపు పరిస్థితిని పునరుద్ధిరించేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణానదీ బోర్డుకు లేఖలో విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం వద్ద మోహరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకునేలా స్పందించాలని కృష్ణా నదీ బోర్డుకు మురళీధర్‌ విజ్ఞప్తి చేశారు.


నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద ఘర్షణ నేపథ్యంలో వివాదం పరిష్కిరంచడానికి బుధవారం రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ చేయనుంది. ఇప్పటికే ఒకసారి సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల కారణంగా డిసెంబర్ 5 తరువాత సమావేశం నిర్వహించాలని జల శక్తిశాఖకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 6వ తేదీన జరిగే సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చలు జరుగుతాయని జలశక్తిశాఖ వెల్లడించింది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×