EPAPER

Revanth Reddy Biography : ఒకే ఒక్కడు.. రేవంత్..!

Revanth Reddy Biography : ఒకే ఒక్కడు.. రేవంత్..!
Revanth Reddy Biography

Revanth Reddy Biography(Telangana news today):

ఆయన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. బాధల్లో ఉన్న ప్రజలకు పెద్దన్నగా నిలిచే సోదరుడు. తన అనుచరులను చైతన్యపరచి పోరుబాట పట్టించే యోధుడు. 20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రతిపక్షంలోనే. కానీ.. అధికారంలో ఉన్నవారికి లేనంత చరిష్మా. అనుకున్నది సాధించటం ఎలాగో తెలిసిన కార్యదక్షుడు. తన సిద్దాంతానికి అనుగుణంగా ప్రజల మనసును మార్చగల చతురుడు. ఆయన మరెవరో కాదు.. గురువారం తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న అనుముల రేవంత్ రెడ్డి.


బయోడేటా
పుట్టినరోజు: నవంబర్ 8, 1969
తల్లిదండ్రులు: నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ
సొంత ఊరు: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి
చదువు: గ్రాడ్యుయేషన్
భార్య: గీతారెడ్డి
కుమార్తె: నైమిషా రెడ్డి

ముళ్లబాట నుంచి సీఎం దాకా..


2007 జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను మట్టికరిపించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తొలివిజయంతోనే అందరి చూపునూ తనవైపు తిప్పుకోగలిగారు.

ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ కమ్మని ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీలో చేరారు.

2009లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథ్ రెడ్డిపై విజయం సాధించి, తన పదునైన ప్రసంగాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతమైన గుర్తింపును సాధించారు.

అలాగే.. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నాటి ఎన్నికల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, 2017 వరకు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా సభలో అధికార పక్షానికి చెమటలు పట్టించారు.

2017 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరి.. మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగారు.

రేవంత్ ప్రతిభను, జనంలో ఆయనకున్న ఆదరణను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మూడేళ్లలోనే ఆయనను ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ప్రకటించి కీలక బాధ్యతలు అప్పగించింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో గులాబీ పార్టీ ధనబలం కారణంగా రేవంత్ ఓటమిపాలయినా.. ఆరు నెలల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటు నుంచి ఎంపీగా గెలిచి.. తనకున్న జన బలమెంతో అధికార పక్షానికి చూపించారు.

జూన్ 26, 2021న రేవంత్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. 2021 జులై 7న నాటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నాటి నుంచి నేటి వరకు.. ఒక్క రోజు విరామం లేకుండా పోరాడుతూనే వచ్చిన రేవంత్.. అనేక గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ ఒక్కతాటి మీదికి తీసుకొచ్చి.. విజయం మనదేననే ధీమాను వారిలో కలిగించారు.

దీని ఫలితంగానే.. నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ విజయపతాక ఎగరవేసింది. ఉద్యమపార్టీగా వచ్చి పదేళ్ల పాలనతో బలంగా నిలదొక్కుకున్న గులాబీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించే శక్తి కాంగ్రెస్ నేతలకు తీసుకొచ్చిన నేతగా జనం మనసులో రేవంత్ నిలిచిపోయారు.

రేవంత్ దీక్షా దక్షతలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. అంతిమంగా ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి పేరునే ఖరారు చేసింది.

రాజకీయ ప్రయాణమంతా ప్రతిపక్షంలోనే సాగిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు తొలిసారి అధికార పక్షంలో కూర్చోబోతున్నారు. అదీ ఏకంగా.. ముఖ్యమంత్రి పదవిలో.

.

.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×