EPAPER

Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ..

Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ..

Andhra Pradesh : రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను ఈ నెల 18 నుంచి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సోమవారం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సకాలంలో మందులు అందించడంతో పాటు, మందుల కొరత కూడా లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడ రాజీపడొద్దని సీఎం సూచించారు.


గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండలంలో జనవరి 1 నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. 2023-24 లో నవంబర్ నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని, ఇది గత ఏడాది కంటే 24.64 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. చైనాలో విస్తరిస్తున్న హెచ్9ఎన్2 వైరస్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.


Tags

Related News

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×