EPAPER

Singareni Elections: ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు.. కార్మిక నేతలకు ఓటర్ల జాబితా

Singareni Elections: ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు.. కార్మిక నేతలకు ఓటర్ల జాబితా
Telangana news today

Singareni Elections(Telangana news today):

తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సింగరేణి కాలరీస్ కార్మికసంఘాల ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు.. సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో సోమవారం సమావేశమయ్యారు.


అక్టోబరులోనే సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి నామినేషన్లను స్వీకరించి, ఎన్నికల చిహ్నాల కేటాయింపులు కూడా జరుగగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు సూచించింది. 3 నెలల క్రితం తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

తాజాగా ఓటర్ల జాబితాను.. శ్రీనివాసులు కార్మిక నేతలకు అందజేశారు. ఈ జాబితా ప్రకారం.. మొత్తం 39,991 మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 6వ తేదీ లోగా చెప్పాలని, 7న అభ్యంతరాల పరిశీలన, 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు రిటర్నింగ్ అధికారి షెడ్యూల్ జారీ చేశారు. డిసెంబర్ 27 వరకూ సింగరేణి కాలరీస్ ఉద్యోగాలుగా రికార్డుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకే ఓటు హక్కు కల్పిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.


Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×