BigTV English

Underwater Temple: సముద్రం కింద విష్ణు ఆలయం… ఇది గుడి మాత్రమే కాదు ఓ అద్భుతం!

Underwater Temple: సముద్రం కింద విష్ణు ఆలయం… ఇది గుడి మాత్రమే కాదు ఓ అద్భుతం!

Underwater Temple: సముద్రం నుంచి 15 నుంచి 29 మీటర్ల లోతులో ఉన్నఈ అండర్‌వాటర్ గార్డెన్‌లో విష్ణు ఆలయం, రాతి విగ్రహాలు, ఆలయ గేట్లు, హిందూ సంస్కృతిని చూపించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇవి పాతకాలం నాటివాటి లాగానే కనిపిస్తాయి. కానీ చుట్టూ రంగురంగుల కోరల్స్, చేపలు తిరుగుతూ ఉంటాయి. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, సముద్రంలో జీవవైవిధ్యాన్ని పెంచే ఒక సజీవ గ్యాలరీ! డైవింగ్ చేసి ఈ సముద్రంలోకి వెళ్తే, మనిషులు తయారు చేసిన కళాత్మకత, ప్రకృతి అందాలు కలగలిసి ఒక మ్యాజిక్‌లా అనిపిస్తాయి. చరిత్ర, సంస్కృతి, పర్యావరణం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది! ఇంతకీ ఈ అండర్‌వాటర్ గార్డెన్‌ ఎక్కడుందో తెలుసా?


బాలి, ఇండోనేషియా.. హిందూ సంస్కృతి, అందమైన ప్రకృతి, వేల ఆలయాలకు ప్రసిద్ధమైన బాలి దీవిలో పెముటెరాన్ బీచ్ సమీపంలో సముద్రం కింద ఓ ప్రత్యేక ప్రదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని ‘లార్డ్ విష్ణు ఆలయం’ అంటూ 5,000 ఏళ్ల పురాతన నిర్మాణమని సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు చెబుతున్నాయి. కానీ నిజం ఏంటంటే, ఇది పాతది కాదు, సముద్ర పరిరక్షణ కోసం సృష్టించిన ఆధునిక చమత్కారం.

5,000 సంవత్సరాల ఆలయమా?
సముద్రంలో 90 అడుగుల లోతులో రాతి విగ్రహాలు, ఆలయం లాంటి నిర్మాణం చూపించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి పురాతన హిందూ నాగరికతకు చెందినవని, మహాభారతంతో ముడిపడినవని, సముద్ర మట్టం పెరిగినట్టు నిరూపిస్తాయని కొందరు అంటున్నారు. కానీ ఇది తమన్ పురా, అంటే టెంపుల్ గార్డెన్. 2005లో సముద్ర పరిరక్షణ కోసం నిర్మించిన కృత్రిమ కోరల్ రీఫ్ ఇది. ఇక్కడి విగ్రహాలు పురాతనమైనవి కావు, సముద్ర జీవులకు ఆశ్రయంగా ఉండేలా ఉద్దేశపూర్వకంగా అమర్చినవి.


రీఫ్ గార్డెనర్స్ ప్రాజెక్ట్
పెముటెరాన్, సింగరాజాకు 50 కి.మీ. పశ్చిమంలోని ఒక చిన్న తీర గ్రామం. ఇక్కడి అండర్‌వాటర్ టెంపుల్ గార్డెన్‌ను 2005లో ఆస్ట్రేలియన్ కన్జర్వేషనిస్ట్ క్రిస్ బ్రౌన్ (పాక్ న్యోమన్) మరియు సీ రోవర్స్ డైవ్ సెంటర్ యజమాని పాల్ ఎం. టర్లీ ప్రారంభించారు. ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సహాయంతో, రీఫ్ గార్డెనర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా దెబ్బతిన్న కోరల్ రీఫ్‌లను పునరుద్ధరించేందుకు ఈ ప్రయత్నం జరిగింది.

ALSO READ: కర్నాటకలో ఈ అద్భుతమైన తీర ప్రాంతం గురించి మీకు తెలుసా?

ఈ ప్రదేశంలో 10కి పైగా హిందూ, బౌద్ధ విగ్రహాలు, 29 మీటర్ల లోతులో 4 మీటర్ల బాలినీస్ కాండి బెంటార్ ఉన్నాయి. 2006లో 15 మీటర్ల లోతులో మరో సైట్‌ను జోడించారు, తద్వారా కొత్త డైవర్లు కూడా సందర్శించగలరు. ఈ నిర్మాణాలు కోరల్ వృద్ధికి, సముద్ర జీవులకు ఆవాసంగా ఉండేలా రూపొందాయి. ఇప్పుడు ఈ విగ్రహాలు కోరల్‌తో కప్పబడి, చేపలతో చుట్టుముట్టబడి, ఆలయం లాంటి మాయాజాల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

అపోహలు ఎందుకు వచ్చాయి?
తమన్ పురాను 5,000 సంవత్సరాల విష్ణు ఆలయంగా భావించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బాలిలో 90% మంది హిందువులు, బలమైన హిందూ సంస్కృతి ఉండటం వల్ల పురాతన ఆలయం అనే ఊహ నమ్మశక్యంగా అనిపిస్తుంది. సోషల్ మీడియా వైరల్ పోస్టులు, సందర్భం లేని వీడియోలు ఈ అపోహను వ్యాప్తి చేశాయి. కోరల్‌తో కప్పబడిన విగ్రహాలు పాతవిగా కనిపించడం కూడా గందరగోళం సృష్టించింది. ఇండియా టుడే, ది లాజికల్ ఇండియన్, పాల్ టర్లీ లాంటి వాళ్లు ఈ నిర్మాణాలు 2005లో అమర్చినవని స్పష్టం చేశారు.

సాంస్కృతిక, పర్యావరణ విలువ
తమన్ పురా పురాతన ఆలయం కాకపోయినా, బాలి సంస్కృతిని, సముద్ర పరిరక్షణను అద్భుతంగా కలిపే ప్రదేశం. హిందూ, బౌద్ధ విగ్రహాలు బాలి ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపిస్తాయి. బయోరాక్ రీఫ్స్ టెక్నాలజీతో కోరల్ వృద్ధిని వేగవంతం చేస్తూ, సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడుతోంది. డైవర్లకు ఈ ప్రదేశం ఆలయం లాంటి వాతావరణంలో సముద్ర జీవులను చూసే అరుదైన అనుభవాన్ని అందిస్తుంది.

ఇంకా ఏం చూడొచ్చు?
పెముటెరాన్ బీచ్‌లోని తమన్ పురాను స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కోసం సందర్శించొచ్చు. సీ రోవర్స్ డైవ్ సెంటర్, రీఫ్ సీన్ డైవర్స్ రిసార్ట్ లాంటి డైవ్ ఆపరేటర్లు గైడెడ్ టూర్లు అందిస్తాయి. కోరల్‌ను కాపాడే ఆపరేటర్లను ఎంచుకోవడం మంచిది. బాలిలో తులంబెన్ బీచ్ దగ్గర స్లీపింగ్ బుద్ధ స్టాచ్యూ, జెమెలుక్ బేలో అండర్‌వాటర్ మెయిల్‌బాక్స్ లాంటి ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి.

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×