Big Stories

Sama Ram Mohan Reddy: ‘ఇంకా అదొక్కటే మిగిలింది..’ హరీష్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్..

Sama Ram Mohan Reddy Comments On Harish Rao: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ మండిపడ్డారు. తెలంగాణ అబద్దాల బ్రాండ్ అంబాసిడర్ హరీష్ అంటూ రామ్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

- Advertisement -

హరీష్ రావు శుక్రవారం ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల పెన్షన్లు పెంచిందని ట్విట్టర్‌లో స్పందించారు. అలాగే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ధాన్యంపై క్వింటాకు 1000 రుపాయల బోనస్ ఇచ్చిందని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సామ రామ్మోహన్ రెడ్డి.

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి పెన్షన్ల నిర్ణయంపై ప్రశంస హరీష్ రావుకు బీజేపీపై ఉన్న భక్తి కనిపిస్తోందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రామ్మోహన్ రెడ్డి. అలాగే ఒడిశా ప్రభుత్వం బోనస్ ఇస్తోందన్న తప్పుడు వార్తలను ప్రచారం చేసిన హరీష్ రావు.. తనకు తానే దిగజారుడు రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసుకున్నారన్నారు.

బీజేపీపై హరీష్ రావు భక్తి ప్రజలందరికీ తెలుసని.. కేవలం బీజేపీ కాళ్లు పట్టుకోవడం మాత్రమే మిగిలిందని తెలిపారు. ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే హరీష్ రావు రోడెక్కి బీజేపీపైన తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Also Read: బాధ్యతల నుంచి తప్పుకోండి.. జస్టిస్ నరసింహారెడ్డి కమిటీకి కేసీఆర్ లేఖ

గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టారు రామ్మోహన్ రెడ్డి. తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం క్షమించరానిదన్నారు. తాము చేసిన అవినీతి నుంచి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిందని అందుకే ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణను చిన్నదిగా చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అలాంటి చర్యలను క్షమించరన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలు బలిపశువులు కావడానికి రెడీగా లేరన్నారాయన.

బీఆర్ఎస్ చేసే ఊసరవెల్లి రాజకీయాలకు తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లతో అదిరిపోయే తీర్పునిచ్చారన్నారు తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News