Big Stories

KCR Meeting with BRS MLA’s: గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ.. కంగారు పడొద్దు.. జగన్ బాటలో..?

Ex Telangana CM KCR Meeting with BRS MLA’s: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టెన్షన్ మొదలైందా? పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఎందుకు ఆపలేకపోతున్నారు? మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతోనే భేటీ ఎందుకు? ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎలాంటి అభయం ఇచ్చారు? భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి పంపించేశారా? మరి కేడర్‌ను కాపాడేదెవరు, భరోసా ఇచ్చేదెవరు? మరో 20 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

- Advertisement -

కారు పార్టీలో కుదుపులు తీవ్రమయ్యాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారిపోతున్నారో అధినేతకు తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. గడిచిన రెండురోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాం రాం చెప్పేశారు. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

- Advertisement -

రేపోమాపో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు కసరత్తు చేసుకున్నారట. ఈ క్రమంలో మంగళవారం ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండె విఠల్ ఉన్నారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు, కీలక ఆధారాలు సమర్పించిన సిట్.. ఇప్పుడేంటి?

దాదాపు నాలుగైదు గంటలపాటు ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఫ్యూచరంతా మనదేనంటూ అరచేతిలో స్వర్గం చూపించారన్నది కొందరు నేతల మాట. ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నదానిపై గులాబీ బాస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని అంటున్నారు. తమ పార్టీకి భవిష్యత్తులో మంచిరోజులు రాబోతున్నా యని, ఎవరూ పార్టీ మారవద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు కేసీఆర్.

మరో నెలరోజుల్లో ప్లాన్ బీని అమలు చేద్దామని అన్నారట. వైఎస్ హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అయినా పార్టీ బలంగా నిలబడిందని గుర్తు చేశారు కేసీఆర్. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడంపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. ఆ అంశంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవు తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు పావుగంటకు పైగానే చర్చలు జరిపారట కేసీఆర్.

Also Read: KCR Distance With KTR: జాడలేని కేటీఆర్.. ఆ పదవి నుంచి తప్పించబోతున్నారా..?

గడిచిన ఆరునెలల్లో కారు పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వద్ద 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు మరికొందరు మారే అవకాశ ముందని అంటున్నారు. ఇక మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో నుంచి వెళ్లిపోవడాన్ని సీరియస్‌గానే తీసుకున్నారట కేసీఆర్. ఇక కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

కేసీఆర్ మాటలను గమనించినవాళ్లు మాత్రం.. వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలికి తగ్గట్టుగానే ఉందని అంటున్నారు. జగన్ మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తామని కేసీఆర్ చెబుతున్నారని అంటున్నారు. అందుకు కార్యాచరణ ఏంటన్నది ఎక్కడా రివీల్ కాలేదని అంటున్నారు. కొద్దిరోజులు ఆగితే కేసీఆర్ ప్లాన్ బీ ఏంటో అందిరికీ తెలిసిపోవడం ఖాయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News