Big Stories

BRS vs BJP : బీఆర్ఎస్ ప్లేస్ లోకి బీజేపీ.. వాపు చూసి బలుపు అనుకుంటున్నారా ?

BRS vs BJP in Telangana(Political news in Telangana): రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే సత్తా బీజేపీకి ఉందా ? పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఓటమితో బీజేపీ పుంజుకుంటుందా..? రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అంటూ పదేపదే కాషాయ నేతలు చెప్పడం ఉట్టి ప్రచారమేనా..? బీఆర్ఎస్ ను బీజేపీ రీప్లేస్ చేయగలుగుతుందా ? లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా సహకరించి తన గొయ్యి తానే తవ్వుకున్న బీఆర్ఎస్.. ఇకనైనా దాన్నుంచి బయటపడుతుందా ? లేకపోతే మరింత కూరుకుపోతుందా ?

- Advertisement -

లోక్ సభ ఫలితాలతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారిపోయామనే భ్రమలతో కనిపిస్తున్నారు బీజేపీ నేతలు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగానే పెరిగింది. పెరిగిన తమ బలాన్ని నిలబెట్టుకుంటూ, రాబోయో ఐదేళ్ల కాలానికి పక్క ప్రణాళికలతో మరింత బలపడే ప్రయత్నం చేస్తే తప్ప బీజేపీ కల రాష్ట్రంలో నెరవేరే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రాభవం తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు వచ్చే ఐదేళ్ల కాలంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలియని నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అంటున్నారు.

- Advertisement -

Also Read : ధర్మపురి అర్వింద్‌కు పితృవియోగం.. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

లోక్ సభ ఎన్నికలపై వున్న శ్రద్ద బీజేపీ అధిష్టానానికి అసెంబ్లీ ఎన్నికలపై ఉండదనే స్పస్టత ఈ పదేళ్ల పరిపాలనలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అదే ధోరణిలో జాతీయ నాయకత్వం మందుకు వెళ్తే మాత్రం తెలంగాణలో బీజేపీ బలపడటం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో బీజేపీకి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దాన్ని ప్రభావం కచ్చితంగా తెలంగాణపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీల సహకారంతో సర్కారు ఏర్పాటు చేసిన బీజేపీకి.. అది బలమా.. బలహీనతా.. అనేది కొన్నాళ్లు గడిస్తే తేలిపోతుందన్న అభిప్రాయం ఇండియా కూటమి సభ్యులతో పాటు, మేధావుల్లో వ్యక్తమవుతుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వమెప్పుడు చావదు. దానికి చావు లేదు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైన ఏ పాత్రలోనైనా కాంగ్రెస్ తన సత్తా చుటుకుంటూనే వస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఎవరు ? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించలేకపోయినా.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి.. ప్రత్యామ్నాయ శక్తిగా స్థిరపడేదెవరు ? బీజేపీనా.. బీఆర్ఎస్సా ? అన్న చర్చ మొదలైంది.

బీజేపీ బీఆర్ఎస్ ప్లేస్ ను భర్తీ చేస్తోందా.. లేక బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటోందా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంపైనే కాదు, బీఆర్ఎస్ పార్టీపైనా పోరాటాలు చేయాలి. కానీ గత పదేళ్ల పాలనలో మోడీతో పాటు, రాష్ట్ర నేతలు కేసీఆర్ అవినీతిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు తప్ప.. ఏనాడు చర్యలు చేపట్టకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ ప్రచారమే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యానికి గండి కొట్టింది. 30 సీట్లైనా గెలుస్తామనుకున్న బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Also Read : రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు దక్కించుకుని బలం పెంచుకున్నప్పటికీ విమర్శలు తప్పడం లేదు. బీఆర్ఎస్ పరోక్ష సహకారంతోనే బీజేపీకి ఎంపీ సీట్లు పెరిగాయంటున్నారు. కాంగ్రెస్‌ను కట్టడి చేయడానికి బీఆర్ఎస్ తన ఓటుబ్యాంకుని డబ్బులు పంచి మరీ బీజేపీ వైపు మళ్లించిదన్న టాక్ ఉంది. దానికి తగ్గట్లే బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దాంతో బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అన్న ప్రచారానికి మరింత ఊతం చేకూరుతోంది.

ప్రస్తుత మొన్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. బెడ్ రూంలో భార్య, భర్తలు ఏం మాట్లాడుకుంటారో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని ఎంజాయ్ చేసిన కేసీఆర్ పాలనను ప్రజలు మళ్​ళీ కావాలనుకోరు. పోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, గొర్రెల పథకం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హెల్త్, ఎడ్యూకేషన్, లిక్కర్, దళితబందు కేసీఆర్ తలపెట్టిన ప్రతి పథకంలో అవకతవకలు జరిగాయనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరినోట వినిపిస్తున్న మాట. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ బలపడటం అసాధ్యమే. మరి ఆ పరిస్థితిని బీజేపీ క్యాష్ చేసుకోగలుతుందా ? బీఆర్ఎస్ స్థానాన్ని రిప్లేస్ చేయడానికి ఇప్పటికైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా ? అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News