EPAPER

Bawarchi Birayni: బావర్చీలో బిర్యానీ తింటున్నారా ? కాస్త ఇది చూడండి..

Bawarchi Birayni: బావర్చీలో బిర్యానీ తింటున్నారా ? కాస్త ఇది చూడండి..

Food Safety Officials Attack in Bawarchi: హైదరాబాద్ లో ఫేమస్ ఫుడ్ ఏది అంటే.. అస్సలు తడబడకుండా చెప్పే సమాధానం.. బిర్యానీ. అవును.. మన హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ లోనే కాదు.. హైదరాబాద్ దమ్ బిర్యానీ అని పేరున్న ఏ హోటల్ లో అయినా బిర్యానీ సేల్ అవ్వాల్సిందే. పేరుకు తగ్గట్టే భాగ్యనగరంలో బిర్యానీ లవర్స్ ఎక్కువ. ఒకప్పుడు బిర్యానీ అంటే.. డబ్బులున్నోళ్లు తినే ఆహారంగా కనిపించేది. కానీ ఇప్పుడు రూ.100కే బిర్యానీ దొరుకుతుంది. కొందరైతే తమ బిజినెస్ పెరగడం కోసం రూ.80 కు కూడా అమ్ముతున్నారు.


సందర్భం ఏదైనా బిర్యానీ కామన్ గా ఉంటుంది. పెళ్లి, పుట్టినరోజులతో పాటు.. ఎగ్జామ్స్ లో పాసైనా బిర్యానీ పార్టీ.. జాబ్ వచ్చినా బిర్యానీ పార్టీ.. సరదాగా బయటికెళ్తే బిర్యానీ.. ఆఖరి వెదర్ మారినా బిర్యానీయే. ఇలా బిర్యానీలు తినే వారు ఎక్కువైపోతుంటే.. అంతకంతకూ రెస్టారెంట్లూ పెరుగుతున్నాయి. మరి అన్ని రెస్టారెంట్లూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తాయా అంటే అదీ ఉండదు. వీక్ డేస్ లో సేల్ అవ్వని బిర్యానీ, ఇతరత్రా ఆహారాలను ఎంచక్కా ఫ్రిడ్జ్ లో పెట్టేసి.. వీకెండ్ లో సేల్ చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి.

Also Read : హైదరాబాద్ బిర్యానీ అంటే అట్లుంటది మరి.. దేశంలోనే టాప్ ప్లేస్!


తాజాగా శంషాబాద్ లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా బావర్చీ మల్టీ కసిన్ రెస్టారెంట్, ఎయిర్ పోర్ట్ బావర్చి, హోటల్ హైదరాబాద్ గ్రాండ్ రెస్టారెంట్ల కిచెన్ లలో తనిఖీలు చేయగా.. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలు లభ్యమయ్యాయి. ఆ వివరాలను అధికారులు.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించారు.

– FSSAI లైసెన్స్ కాపీ లేదు

– కస్టమర్లకు ఇచ్చే తాగునీటిలో TDS 24 మాత్రమే ఉంది.

– స్టోర్ రూమ్ లో సింథటిక్ ఫుడ్స్ కలర్స్ లభ్యమయ్యాయి.

– సెమీ ప్రిపేర్ చేసిన ఫుడ్స్, మూతలతో కప్పి ఉంచని ఆహారాలు కనిపించాయి.

– ఎలుకలు ఎక్కువ. కిచెన్ లోనే ఎలుకల వ్యర్థాలు ఉండటం

– కిటికీలపై క్రిమి ప్రూఫ్ స్క్రీన్లు లేవు

– పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు FBO వద్ద అందుబాటులో లేవు

– పైకప్పు, ఫ్లోరింగ్ పై ఫ్లాకింగ్ ప్లాస్టర్లను వేసి ఉంచారు. కిలోల కొద్దీ చికెన్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచారు.

– గడువు తీరిన మిల్క్ షేక్స్ అమ్మడంతో పాటు.. ఆహార పదార్థాల్లో ఎక్స్పైర్ అయిన సాస్ లను ఆహారపదార్థాలలో వాడుతున్నట్లు గుర్తించారు.

ఇలాంటి దర్టీ కిచెన్ లో వండిన, నిల్వఉంచిన ఆహారాన్ని, బిర్యానీలను బాగున్నాయంటూ లొట్టలేసుకుంటూ తింటే తర్వాత మీ ఆరోగ్యమే పాడవుతుంది. రూ.100కే బిర్యానీ వస్తుందని వెళ్తే.. తర్వాత లక్షలు ఖర్చవుతాయి.

Related News

Andhra, Telangana: మరోసారి తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల మధ్య వివాదం

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Big Stories

×