Big Stories

MLA Sanjay Kumar: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

BRS MLA Sanjay Kumar: బీఆర్ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎ రేవంత్ రెడ్డి కండువాను కప్పి సంజయ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

కాగా, ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడిన విషయం తెలిసిందే. అంతకుముందు ఖైరతాబాదాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News