EPAPER
Kirrak Couples Episode 1

Rohit Sharma and Rashid Khan: ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ల మాట..

Rohit Sharma and Rashid Khan: ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్ల మాట..

The Captains Reacted after The India vs Afghanistan T20 World cup 2024 Match: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8 లో  ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పిచ్ పరిస్థితులకు తగినట్టుగా జట్టులో మార్పులు చేశామని అన్నాడు. ఇక్కడ స్లో పిచ్ కారణంగా సిరాజ్ ను తప్పించి, కులదీప్ ను తీసుకున్నామని తెలిపాడు. అది సత్ఫలితాలనిచ్చిందని తెలిపాడు. వరుసగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కులదీప్ బౌలింగు చేసేసరికి ప్రత్యర్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారని అన్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో దిగాలనే వ్యూహం పనిచేసిందని అన్నాడు.


ఒకవేళ తర్వాత మ్యాచ్ ల్లో పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని భావిస్తే సిరాజ్ వస్తాడని రోహిత్ అన్నాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్లు సూర్య, పాండ్యా ఇద్దరు గొప్ప పరిణితి చూపించారని తెలిపాడు. వారిద్దరి భాగస్వామ్యమే విజయంలో కీలక పాత్ర పోషించిందని అన్నాడు. ఏదైనా జట్టు అవసరాల రీత్యా ఆడేందుకు ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారని అన్నాడు. విండీస్ లో టీ 20లు ఆడిన అనుభవం ఇప్పుడు పనికి వస్తోందని అన్నాడు. ఇలాగే సమష్టి కృషితో ముందుకు వెళతామని అన్నాడు.

Also Read: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. అర్షదీప్ కి వచ్చేదే.. జస్ట్ మిస్!


ఓటమి అనంతరం ఆఫ్గనిస్తాన్ కెప్టెన్  మాట్లాడుతూ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకపోవడమే ఓటమిని శాసించిందని చెప్పాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పలేదని అన్నాడు. అందరూ షాట్లకు వెళ్లి అవుట్ అయ్యారని అన్నాడు. టీ 20 మ్యాచ్ లో నెట్ రన్ రేట్ కీలకం కాబట్టి, ప్రతి ఒక్కరూ ఎటాకింగ్ ఆడాల్సిందేనని, కాకపోతే ఒకొక్కసారి అదృష్టం కూడా కలిసి రావాలని అన్నాడు.

ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని రషీద్ ఖాన్ అన్నాడు. అయితే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయాలని చెప్పాడు. అది భారత్ చేసిందని అన్నాడు.  అయితే పెద్ద జట్లతో ఆడుతున్నప్పుడు 160-170 పరుగుల లక్ష్యాలను గతంలో ఛేదించాం. ఫర్వాలేదని అనుకున్నాం. అయితే కాస్త తెలివిగా బ్యాటింగ్ చేసుంటే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించేవాళ్లమని అన్నాడు.

Tags

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×