Big Stories

T20 World Cup 2024 Final Match: అదృష్టం మనవైపే ఉంది.. ఫైనల్ మ్యాచ్ పై ద్రవిడ్

Rahul Dravid comments on T20 final match(Sports news headlines): టీ 20 ప్రపంచకప్ లో ఫైనల్ మ్యాచ్ కి టీమ్ ఇండియా అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఈసారి కూడా ప్రతి మ్యాచ్ లాగే మనకి బ్యాటర్ల ఫామ్ రూపంలో, బౌలర్ల రూపంలో, టాస్ రూపంలో ఇలా అన్నిరకాలుగా అదృష్టం కలిసి వచ్చిందని అన్నారు. ఫైనల్ మ్యాచ్ కి కూడా అలాగే ఉంటుందని తెలిపాడు. ఒక్క ఏడాదిలో టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టీ 20 ఫైనల్ ఇలా మూడు సార్లు ఐసీసీ ఫైనల్స్ కి చేరిందని గుర్తు చేశాడు.

- Advertisement -

అన్నింటికి మించి పిచ్ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని అన్నాడు. అంటే ద్రవిడ్ ఏ ఉద్దేశంతో చెప్పాడని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. మొత్తానికి తేల్చిందేమిటంటే పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది, మన టాప్ మోస్ట్ స్పిన్నర్లు విజృంభిస్తారని ఆలోచించి ఆ మాట అని ఉంటాడని అంటున్నారు.

- Advertisement -

ఫైనల్ మ్యాచ్ అనగానే అందరికీ ఒత్తిడి ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా, శారీరకంగా, మానసికంగా ఇలా అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నట్టు ద్రవిడ్ తెలిపాడు. గత వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా బాగా ఆడింది అంతే. ఆటలో గెలుపోటములు సహజమని అన్నాడు. ద్రవిడ్ కోసమో, రోహిత్ కోసమో కాదు దేశం కోసం ఆడాలని తెలిపాడు. అందులో మా పాత్ర వన్ పర్సంట్ మాత్రమేనని అన్నాడు.

Also Read: అమ్మాయిలు అదుర్స్.. 603 డిక్లేర్డ్.. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో రికార్డ్ స్కోరు

ఇండియా ఇంతదూరం వచ్చిందంటే, నేనొక్కడినే కాదని అన్నాడు. మా జట్టు వెనుక వందలమంది కృషి ఉందని అన్నాడు. మన బ్యాటర్లకి ప్రాక్టీస్ లో బంతులు వేసే లోకల్ బౌలర్ల పాత్ర కూడా ఉన్నట్టేనని అన్నాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ, బీసీసీఐ వీరందరూ భారత్ విజయం కోసం పనిచేస్తున్నవారేనని అన్నాడు. అందుకని క్రెడిట్ ఏ ఒక్కరికో ఇవ్వవద్దని తెలిపాడు.

వరుస విజయాలతో దూకుడుగా ఉన్న దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయడం లేదని తెలిపాడు. సూపర్ 8లో ఇదే పిచ్ పై ఆఫ్గనిస్తాన్ తో ఆడామని గుర్తు చేశాడు. పిచ్ ను మార్చారో లేదో తెలీదు. కానీ ఇక్కడ పరిస్థితులపై అవగాహన ఉండటం కలిసి వస్తుందని అన్నాడు. జట్టులో అందరూ ఫైనల్ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారని తెలిపాడు. అందరిలో ఆ స్పిరిట్, జోష్ వచ్చిందని పేర్కొన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News