Big Stories

Kane Williamson: కివీస్ కెప్టెన్ కేన్ మామ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు

Kane Williamson latest news(Sports news headlines): న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే, టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, ఇప్పటికే కేన్ విలియమ్సన్ టస్ట్ మ్యాచ్‌లకు సైతం కెప్టెన్సీ వదులుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, వన్డే, టీ20 మ్యాచ్‌లకూ కూడా కెప్టెన్‌గా చేయనని నిర్ణయం తీసుకోవడంతో మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతోపాటు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను సైతం తిరస్కరించాడు.

- Advertisement -

ఘోర వైఫల్యమే కారణమా?
టీ20 వరల్డ్‌కప్ 2024లో న్యూజిలాండ్ ఘోర వైఫల్యం చెందింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మొదటిసారి న్యూజిలాండ్ గ్రూప్ దశ నుంచి నిష్క్రమించడంతోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ కనీసం సెమీ ఫైనల్స్‌కు వెళ్లకుండా ఇంటిదారి పట్టింది.

- Advertisement -

ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో తలపడిన మొదటి మ్యాచ్‌లోనే ఏకంగా 84 పరుగులతో ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత వెస్టిండీస్‌పై 13 పరుగుల తేడాతో ఓటమి చెందింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో న్యూజిలాండ్ ఆశలు అప్పగికే గల్లంతయ్యాయి. ఇక చివరి రెండు మ్యాచ్‌లు పపికూనలు ఉగాండ, పపువా న్యూగినియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లు గెలిచిన ప్రయోజనం కలగలేదు. దీంతో సూపర్-8కు అర్హత సాధించలేదు. చివరి మ్యాచ్ తర్వాత కేన్ విలియమ్సన్.. కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొంది.

రిటైర్మెంట్ ఇస్తాడా?
కేన్ విలియమ్సన్.. మూడు ఫార్మాట్‌లో కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కేన్ తీసుకునే వరుస నిర్ణయాలతో త్వరలో రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యం లేదని అభిమానులు అనుకుంటున్నారు. కానీ కేన్ మాత్రం తాను మూడు ఫార్మాట్‌లో ఆడతానని పరోక్షంగా చెప్పాడు. న్యూజిలాండ్ తరపున ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తుంటానని, జట్టు కోసం చేయాల్సింది చాలా ఉందిని, ఏదైనా చేయాలనే తపనతో ఉన్నట్లు చెప్పాడు.

కేన్ విలియమ్సన్ తన కెరీర్‌లో పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021లో న్యూజిలాండ్ విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కేన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ ఫైనల్‌కు వెళ్లింది. తన కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని అందుకున్నాడు. అలాగే 165 వన్డేలు, 93 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 40 టెస్ట్‌లు, 91 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకంపనలు.. మళ్లీ ఇదెక్కడి గొడవరా బాబూ !

కేన్ విలియమ్సన్.. తెలుగు వాళ్లు కాకపోయినా ‘కేన్ మామ’ అని పిలుస్తుంటారు. అయితే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న కేన్‌ను ఇక్కడి అభిమానులు పిలుస్తూ వస్తున్నారు. దీంతో ఇక్కడి అభిమానం.. అంతటా పాకింది. ఇంకా టీ20 వరల్డ్ కప్ 2026 ఆడతారా? అనే ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఆ మెగా టోర్నీకి చాలా సమయం ఉందని, పరిస్థితులు మారవచ్చు కదా? ఒకవేళ అనుకూలంగా ఉంటే చూద్దామని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News