BigTV English

Rahul Dravid Quits: రాజస్థాన్ నుంచి ద్రవిడ్ అవుట్… రంగంలోకి బ్రెట్ లీ ?

Rahul Dravid Quits: రాజస్థాన్ నుంచి ద్రవిడ్ అవుట్… రంగంలోకి బ్రెట్ లీ ?

Rahul Dravid Quits: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తో తన అనుబంధాన్ని ముగించారు. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా కేవలం ఒక్క సీజన్ మాత్రమే పని చేసిన అనంతరం.. ద్రావిడ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. ద్రవిడ్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. రాహుల్ ద్రవిడ్ గతంలో కూడా అనేక సంవత్సరాలు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించారు.


Also Read: Digvesh Rathi Fined: దిగ్వేష్ దూల తీరింది…. నితీష్ తో గొడవపై భారీ ఫైన్

ఆయన సారధ్యంలో రాజస్థాన్ జట్టులో నుంచి పదుల సంఖ్యలో యంగ్ ప్లేయర్స్ వచ్చి భారత జట్టులో సైతం అరంగేట్రం చేశారు. రాహుల్ ద్రావిడ్ 2012, 2013 లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మెంటార్ గా పనిచేశాడు. అనంతరం 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహించాడు. ఇక 2021లో ఎన్సీఏ నుండి తప్పుకొని రవి శాస్త్రి స్థానంలో భారత జట్టు హెడ్ కోచ్ అయ్యాడు. అనంతరం ఆ పదవి నుండి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టి.. తాజాగా ఈ బాధ్యతలనుంచి కూడా తప్పుకున్నాడు.


అయితే 2025 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరచడమే ఈ నిర్ణయానికి దారి తీసినట్లు సమాచారం. ద్రావిడ్ మార్గ నిర్దేశంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2025 సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలో.. కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ ద్రావిడ్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేస్తూ.. ” రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 2026 ఐపీఎల్ సీజన్ కి ముందు తన పదవీ కాలాన్ని ముగించుకుంటున్నారు.

జట్టు ప్రయాణంలో ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఎందరో యువ ఆటగాళ్లను ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలను నిర్మించింది. ఫ్రాంచైజీ సంస్కృతిపై చెరగని ముద్ర వేసింది. జట్టు నిర్మాణంలో భాగంగా రాహుల్ ద్రావిడ్ కి మరో పదవిని ఫ్రాంచైజీ ఆఫర్ చేసింది. కానీ దానిని ఆయన స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది తరపున రాహుల్ ద్రావిడ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. అంతేకాకుండా రాహుల్ రాహుల్ కి వీడ్కోలు పలుకుతూ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఓ భావోద్వేగాపూరిత పోస్ట్ చేసింది.

Also Read: RCB: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు.. చిన్న స్వామి ఘటనపై RCB మరో షాకింగ్ పోస్ట్

” పింక్ జెర్సీలో మీ ఉనికి యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందరికీ స్ఫూర్తినిచ్చింది మీరు ఎప్పటికీ రాయల్. మీకు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం” అని ట్వీట్ చేసింది. అయితే ఓవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీని విడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో బ్రెట్ లీ ని నియమించబోతున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Related News

IPL tickets-GST: ఐపీఎల్ కు ఊహించని ఎదురు దెబ్బ… భారీగా పెరగనున్న టికెట్ల ధరలు..ఎంతంటే

CSK: శ్రీనివాసన్ చేతిలోకి మళ్ళీ CSK… వచ్చే సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్?

MS Dhoni-GST: GSTలో మార్పులు…ధోనికి ఊహించ‌ని షాక్‌..ఇక CSK ప్లేయ‌ర్లు అప్పుల పాలే !

Heinrich Klaasen: నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

Big Stories

×