E-Paper
Advertisement

David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

David Warner :  ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్ తో ఫ్యాన్స్ ని సర్ ఫ్రైజ్ చేసారు. షార్ట్ హెయిర్ తో ఉండే వార్నర్ ఇలా లాంగ్ హెయిర్ తో దర్శనమిచ్చారు. కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వస్తోంది అంటూ ఓ ఫోటోని ఇన్ స్టా స్టోరీ గా పెట్టారు. పొడవైన జుట్టుతో కనిపించగానే వార్నర్ మళ్లీ ఏదైనా మూవీలో నటిస్తున్నారేమో అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నితీన్ రాబిన్ హుడ్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.   దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఇటీవలే  ఒక యాడ్ చేసిన విషయం విధితమే. అయితే డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తే.. ఎలాఉంటుంది..? అతన్ని డైరెక్ట్ చేస్తే ఎలా  ఉంటుందనే వీడియోని గతంలో క్రియేట్ చేసారు. అప్పట్లో అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Also Read :  IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

మహేష్ బాబు మూవీలో డేవిడ్ వార్నర్.. 

తాజాగా మహేష్ బాబు-రాజమౌళి మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ విలన్ గా నటిస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అయితే అందుకు సంబంధించిన ఫొటో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. మరోవైపు మహేష్ బాబు కూడా అదే స్టైల్ లో ఇటీవలే ఫొటోలో కనిపించడం గమనార్హం. అటు మహేష్ బాబు, ఇటు వార్నర్ ఒకే స్టైల్ లో ఫొటోల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. మరోవైపు డేవిడ్ వార్నర్ న్యూ లుక్ చూసి మరికొందరూ ధోనీతో పోల్చడం ప్రారంభించారు. ధోనీ క్రికెట్ కెరీర్ ప్రారంభంలో ఉన్న జుంపాలా నెత్తి మాదిరిగా డేవిడ్ వార్నర్ కూడా పొడవైన జుట్టుతో కనిపించాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఇన్ స్టాలో వార్నర్ స్టోరీ.. 

మరోవైపు “Its  Coming Along Well” అంటూ  బ్లాక్ టీ షర్ట్ లో నవ్వుతూ ఉన్నటువంటి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. వార్నర్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కి డేవిడ్ వార్నర్ ఆడిన సమయంలో తెలుగు అభిమానులకు పరిచయం. తెలుగు సినిమాలకు సంబంధించిన పలు పాటలకు కూడా డ్యాన్స్ చేశారు వార్నర్. పుష్ప గెటప్ లో హంగామా చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ముఖ్యంగా SRH కి 2016ట్రోఫీని కూడా అందించాడు. ఇప్పటికీ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ తీసుకోవాలని కోరుతుండటం విశేషం. వార్నర్ ఏ జట్టు తరపున ఆడినా ఓపెనింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతాడు. క్రీజులో ఉన్నంత సేపు  ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు.

 

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×